ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో మెగా సీడ్ పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 21: రాష్ట్రంలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన ఐవా స్టేట్ వర్శిటీ ముందుకొచ్చింది. ఈమేరకు అమెరికాలోని ఐవాలో ఎపి ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు, ఐవా స్టేట్ వర్శిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో సీడ్ పార్క్‌తో పాటు ఎపి సీడ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఆసియాలో సీడ్ టెక్నాలజీలో ప్రపంచ స్థాయి సెంటర్‌గా ఇది మారే అవకాశం ఉంది. ఈ పథకం కింద నాణ్యమైన విత్తనాలు రాష్ట్రంలోని రైతులకు అందుబాటులోకి తెస్తారు. తరువాత దీన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తారు. విత్తనాలపై పరిశోధన, కొత్త రకాల ఆవిష్కరణ, విత్తన విధానం, నియంత్రణలు, మెగా సీడ్ పార్క్ ద్వారా సీడ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్, గ్లోబల్ సీడ్ ప్రోగ్రామ్స్, విత్తన రంగంలో సామర్థ్యం పెంపు వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారని ఎపిఇడిబి సిఇఒ జె కృష్ణకిషోర్ తెలిపారు.