ఆంధ్రప్రదేశ్‌

పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని ఏ చట్టంలో ఉంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, నవంబర్ 22: గాంధీ మార్గంలో చేసే సత్యాగ్రహ పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని ఏ చట్టంలో ఉందో తెలియచేయాలని ఆంధ్రప్రదేశ్ డిజిపి సాంబశివరావును కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఈమేరకు డిజిపికి మంగళవారం ఆయన ఒక లేఖ రాశారు. మంగళవారం కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో లేఖకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నవంబర్ 12న పాదయాత్రకు అనుమతి లేదని, గొడవలు జరగవని హామీ ఇస్తే పరిశీలిస్తామని, రాష్ట్రంలో సెక్షన్ 30 అమలులో ఉందని డిజిపి పేర్కొన్నారన్నారు. గతంలో చంద్రబాబునాయుడు, రాజశేఖరరెడ్డి, జగన్మోహనరెడ్డి, కమ్యూనిస్టు నాయకులు చేసిన యాత్రలకు, ర్యాలీలకు అనుమతి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఎవరికీ లేని నిబంధనలు కాపు సత్యాగ్రహ యాత్రకు ఎందుకు అవసరమో చెప్పాలన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే పలు ఉద్యమాలు చేశారని, రాజస్థాన్, గుజరాత్, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన ఉద్యమాలకు అనుమతి ఉందా అని ముద్రగడ లేఖలో ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఆయన బంధుగణం సామాన్య భక్తులు స్నానాలు చేసే ఘాట్లలో స్నానం చేయడం వల్ల 30 మంది పుష్కర యాత్రికులు దారుణంగా మృతి చెందారన్నారు. ఈ సంఘటనలో ముఖ్యమంత్రిపై కాని, ఆయన కుటుంబ సభ్యులపై కాని హత్యానేరం కింద ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కేవలం ప్రచారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు షూటింగ్ నిమిత్తం యాత్రికుల మధ్యకు చేరి ఈ కార్యక్రమం నిర్వహించారన్నారు. ఈ ఘటనలో చంద్రబాబే ప్రధాన నిందితుడు కనుక నేరం నుండి తప్పించుకునేందుకు సంఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న సిసి కెమెరా పుటేజ్‌లు ధ్వంసం చేయించారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై చంద్రబాబును ప్రాసిక్యూట్ చేసి నష్టపరిహారం వసూలు చేయాలన్నారు. తుని ఘటనతో తనకు, తన జాతికి సంబంధం ఉందని రుజువు చేస్తే తన యావదాస్తిని పరిహారంగా చెల్లిస్తానన్నారు. అదీ చాలకపోతే తమ జాతి అంతా బిక్షాటన చేసి పరిహారం చెల్లిస్తామన్నారు. ఈ ఒప్పందం నుండి పారిపోయే ప్రసక్తే లేదని ముద్రగడ స్పష్టం చేశారు. చంద్రబాబు మాదిరిగా కోర్టు స్టే తెచ్చుకోవడం వంటి చొప్పదాటు వైఖరికి పాల్పడనన్నారు.