ఆంధ్రప్రదేశ్‌

అభిృవద్ధిలో దూసుకుపోతున్న భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి,నవంబర్ 22: అభివృద్ది చెందిన దేశాల జాబితాలో భారత్ చేరబోతోందని కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు ఆర్.చిదంబరం పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జరిగిన సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 35వ స్నాతకోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భారతదేశం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతోందన్నారు. క్లిష్టపరిస్థితుల్లో సుహృద్భావ వాతావరణం అవసరమన్నారు. సాఫ్ట్‌వేర్, సాంకేతిక రంగాల్లో వేగంగా వృద్థి సాధిస్తున్నామన్నారు. భారతదేశం ఆర్థికంగా విజ్ఞానభాండాగారంగా మార్పుచెందాలన్నారు. అదే సమయంలో ప్రాచీనసంస్కృతి, విలువలను కలుపుకుని ముందుగా సాగాలన్నారు. భారత్ గొప్పదనాన్ని ప్రపంచదేశాలు అప్పుడే గుర్తిస్తాయన్నారు. విలువలతో కూడిన సత్యసాయి విద్యావిధానం నేటి తరానికి ఎంతో అవసరమన్నారు. విద్యార్థులు మంచి నడవడిక నేర్చుకోవాలన్నారు. వర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కెబిఆర్ వర్మ మాట్లాడుతూ సత్యసాయి విద్యావిధానం ఆవశ్యకత గురించి వివరించారు. ప్రస్తుతం వర్శిటీలో నాలుగు క్యాంపస్‌లు ఉన్నాయన్నారు. సాయి విద్యార్థులు అతి తక్కువ ఖర్చుతో వృథానీటిని శుద్దిచేసే మైక్రోప్యూయల్‌సెల్ఫ్ కనుగొన్నారన్నారు. 495 మంది విద్యార్థుల్లో 25 మందికి బంగారు పతకాలు, 10 మందికి పిహెచ్‌డిలు అందజేస్తున్నామన్నారు. ఛాన్స్‌లర్ హోదాలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్‌ఎన్ వెంకటాచలయ్య హాజరవ్వగా, సత్యసాయి సెంట్రల్‌ట్రస్టు సభ్యులు ఆర్‌జె రత్నాకర్, చక్రవర్తి, నరేంద్రనాథ్‌రెడ్డి, నాగానంద తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు, సర్ట్ఫికెట్లు అందజేశారు.

చిత్రం.. సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 35వ స్నాతకోత్సవ వేడుకల్లో మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు ఆర్.చిదంబరం