ఆంధ్రప్రదేశ్‌

బోర్డులు, శిలాఫలకాలు తెలుగులోనే ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, అన్ని రకాల వ్యాపార సంస్థల సంస్థల బోర్డులతోపాటు శంకుస్థాపన ప్రారంభోత్సవ శిలాఫలకాలన్నీ తెలుగులో ఉండేలా చట్టాన్ని తీసుకురావాలంటూ రాజ్యసభ మాజీ సభ్యుడు, పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడిక్కడ మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రాంతంలో నేటికీ శిలాఫలకాలు ఆంగ్ల భాషలోనే సాక్షాత్కరించడం ఎంతో బాధాకరమన్నారు. ప్రధాన మంత్రి మోదీ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ఆంగ్లంలో ఏర్పాటు చేయడాన్ని తామంతా నిరసించడమే కాకుండా తాము తెలుగు భాషలో రూపొందించిన శిలాఫలకాన్ని అందించినా నేటికీ ఆవిష్కరించలేదన్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్‌జైట్లీ, సిఎం చంద్రబాబు ఆవిష్కరించిన ‘విట్’ శిలా ఫలకాలు కూడా ఆంగ్ల భాషలోనే ఉన్నాయని అన్నారు.