ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ ఆదాయానికి బ్యాంకుల గండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 22: పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం కల్పించిన కొన్ని వెసులుబాట్లు అమలుకు నోచుకోవట్లేదు. ఎంత మొత్తాన్నైనా వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసుకోవడంతో పాటు, అవసరమైన డిడి, చలానాలు ఇవ్వాల్సిన బ్యాంకులు ససేమిరా అనడంతో కొన్ని ప్రభుత్వ శాఖల ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌పై ఒత్తిడి పెంచుతోంది. నోట్ల రద్దుతో 40 శాతం రిజిస్ట్రేషన్లు నిలిచిపోగా, మరికొన్ని రిజిస్ట్రేషన్లు బ్యాంకర్ల నిబంధనలతో ఆగిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాల్సిన చలానాలకు పెద్ద నోట్లు తీసుకోమంటూ బ్యాంకర్లు ఆంక్షలు విధించడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ స్థిరాస్తిని కొనుగోలు చేస్తే అందుకు అవసరమైన ఫీజును చలానా రూపంలో చెల్లిస్తుంటాయి. ఈ నెల 8న పెద్ద నోట్లు రద్దు చేయడంతో విశాఖ నగరం, గ్రామీణ జిల్లా పరిధిలో ఆస్తుల క్రయ విక్రయాలు దారుణంగా పడిపోయాయి. అప్పటికే నగదు లావాదేవీలు పూర్తి చేసుకున్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు మాత్రం చేసుకునేందుకు క్రయ, విక్రేతలు సిద్ధ పడుతుండగా బ్యాంకర్లు కొత్త నిబంధనలను తెరపైకి తేవడంతో సందిగ్ధత నెలకొంది. ఆస్తుల క్రయ, విక్రయాలకు సంబంధించి ప్రభుత్వ విలువ (బుక్ వాల్యూ)లో 7.5 శాతం స్టాంప్ డ్యూటీతో పాటు యూజర్ ఛార్జీలను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీనిలో డెఫిషిట్ స్టాంప్ డ్యూటీగా 5 శాతం (గ్రామీణ ప్రాంతంలో 6.5 శాతం), రిజిస్ట్రేషన్ ఫీజుగా 1 శాతం, ట్రాన్స్‌ఫర్ డాక్యుమెంట్ పేరిట 1.5 శాతం ఫీజులుగా వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని ఆస్తి రిజిస్ట్రేషన్‌కు ముందు భారతీయ స్టేట్ బ్యాంకు నుంచి చలానా రూపంలో తీసుకుంటారు. అయితే నోట్ల రద్దు అనంతరం రూ.500, రూ.1000 నోట్లతో చలానాలు తీసుకునేందుకు ఎస్‌బిఐకి వెళ్లే స్తిరాస్థి కొనుగోలు దారులకు బ్యాంకర్లు చెమటలు పట్టిస్తున్నారు. పెద్ద నోట్లతో చలానాలు తీసుకునేందుకు అనుమతించట్లేదని మొండికేస్తున్నారు. తప్పనిసరి అవసరమైతే సంబంధిత రిజిస్ట్రార్ నుంచి స్థిరాస్తి కొనుగోలు నిమిత్తం డిక్లరేషన్ తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు. ఇదే విషయాన్ని రిజిస్ట్రార్ కార్యాలయాలకు తెలియజేస్తే, అటువంటి డిక్లరేషన్లు తాము ఇవ్వలేమంటున్నారు. దీంతో పాత నోట్లతో చలానాలు తీసుకోలేక, కొత్త నోట్లు సమకూర్చుకోలేక క్రయ, విక్రేతలు అవస్తలు పడుతున్నారు. బ్యాంకర్ల వాదన మరో విధంగా ఉంది. నోట్ల రద్దు అనంతరం నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు కొంతమంది ఈ మార్గాన్ని ఎంచుకున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మొత్తంలో పాత నోట్లతో చలానా తీసుకుని, ఆరు నెలల కాల పరిమితిలోగా కేవలం 2 శాతం రద్దు ఛార్జీలతో సొమ్ము చేసుకుంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికోసమే తాము రిజిస్ట్రార్ నుంచి డిక్లరేషన్ కోరుతున్నట్టు పేర్కొంటున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజి టి సరోజను వివరణ కోరగా, ఈ నెల 24 వరకూ చలానాలు తీసుకునేందుకు బ్యాంకర్లు రద్దయిన పెద్ద నోట్లను అనుమతించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనికి సబ్ రిజిస్ట్రార్ల నుంచి డిక్లరేషన్ కోరడం కొంతమేర తమకు ఇబ్బంది కరమని పేర్కొన్నారు.