ఆంధ్రప్రదేశ్‌

చిల్లర ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 22: పెద్దనోట్ల రద్దుతో చిల్లర సమస్యను తీర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిన ప్రభుత్వం, బ్యాంకులు ఇందుకు ప్రత్యామ్నాయంగా రూపే, డెబిట్ కార్డులను తప్పనిసరిగా వాడాలంటూ ప్రజలపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. నగర, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపార వర్గాల వద్ద మాత్రమే చలామణీలో ఉన్న డెబిట్ కార్డులను ఒక్కసారిగా పేద, మధ్య తరగతి వర్గాలపై రుద్దాలని చూడటం ఎంతమాత్రం సబబు కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నోట్ల రద్దు, చిల్లర నోట్లు లభించకపోవడంతో దిగాలు పడ్డ సామాన్యులకు ఈ సాంకేతిక ప్రయోగం శిరోభారంగా మారిందని వాపోతున్నారు. ఉద్యోగ, వ్యాపార వర్గాలకు చెందిన వారు ఎటిఎం, డెబిట్ కార్డులను ఇటీవలి కాలంలో ఎక్కువగానే వినియోగిస్తున్నారు. అయితే అన్ని రకాల లావాదేవీలకూ ఈ కార్డులు అక్కరకొచ్చే అవకాశాలుండవు. రోజూవారీ కార్యకలాపాలకు చిల్లర నోట్ల అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి వర్గాల వారి విషయానికొస్తే తప్పనిసరిగా చిల్లర నోట్ల రూపంలోనే రోజు గడుస్తుంది. సాధారణంగా రూ.10 నుండి రూ.100 నోట్లతో రోజూవారీ జీవనం సాగుతుంది. అర్థాంతరంగా పెద్ద నోట్లను రద్దుచేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా చిల్లర నోట్లను అందుబాటులోకి తీసుకురావడంలో ఘోర వైఫల్యం చెందింది. పెద్ద నోట్లు రద్దయి దాదాపు రెండు వారాలు కావస్తున్నా ఇంతవరకు కనీసం కొత్త రూ.500 నోట్లు కళ్లచూడలేదని, కేవలం రూ.2000 నోట్లను మాత్రమే చూశామని ఆయా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇదే సమయంలో 10,20,50,100 రూపాయల నోట్లను కూడా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా మార్కెట్‌లోకి విడుదల చేయలేకపోయింది.