ఆంధ్రప్రదేశ్‌

నోట్ల రద్దు..ఓ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 22: కేంద్రప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక పెద్ద కుంభకోణమే ఉందని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఆరోపించారు. మంగళవారం గుంటూరు మార్కెట్ సెంటర్‌లో ఎటిఎం కేంద్రాలను పరిశీలించి, చిరువ్యాపారుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజానీకంతో పాటు చిరువ్యాపారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రద్దు కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2 వేల రూపాయల నోటు వలన సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ఉపయోగం లేదని, 100, 500 నోట్లను ప్రజలకు మరింతగా అందుబాటులో ఉంచాలన్నారు. ప్రధాని మోదీ 50 రోజుల్లో ఇబ్బందులు తొలగిపోతాయని చెప్తుండగా కేంద్ర ఆర్థిక మంత్రి నాలుగు నెలలు పడుతుందని పొంతన లేని ప్రకటనలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. 500, 1000 నోట్లను రద్దు చేయాలని ప్రధాని మోదీకి తానే ఉత్తరం రాశానని, అందువల్లే రద్దు చేశారని చెప్తున్న ఎపి సిఎం చంద్రబాబు 2 వేల రూపాయల నోటు రద్దు చేయాలని ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. నోట్లు మార్చుకునేందుకు క్యూలో ఉండి చనిపోయిన 70 మందికి, బ్యాంకు సిబ్బంది ఆరుగురికి ఒక్కొక్కరికీ 25 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా కేంద్రప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆర్‌బిఐ గవర్నర్ రాజీనామా చేయాలి
తిరుపతి: నల్లకుబేరుల వద్ద ఉన్న నల్లధనాన్ని వెలికితీస్తానని పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని మోదీ సామాన్య ప్రజలపై సర్జికల్ దాడి చేశారని, ఇందుకు తక్షణం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలసి సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ డిమాండ్ చేశారు. పెద్ద నోట్లను రద్దుచేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వ విధానానికి నిరసనగా నారాయణ ఆధ్వర్యంలో ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం స్థానిక ఎస్‌బిఐ రీజనల్ కార్యాలయం పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తిరుపతి-రేణిగుంట రోడ్డుపై బైఠాయించి రాస్తారాకోకు దిగారు. పోలీసులు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, జిల్లాకార్యదర్శి రామానాయుడుతో సహా దాదాపు వంద మందిని అరెస్టు చేశారు. నారాయణను తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని కార్యకర్తలు ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుపడటంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

చిత్రాలు..గుంటూరులో పెద్దనోట్ల రద్దు ఇబ్బందులు తెలుసుకుంటున్న రఘువీర తదితరులు
* తిరుపతిలో ఎస్‌బిఐ రీజనల్ ఆఫీసు ఎదుట సిపిఐ నాయకుల ధర్నా