ఆంధ్రప్రదేశ్‌

మొబైల్ బ్యాంకింగ్‌లో మహిళాశక్తిని చాటిచెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 24: సంక్షోభాన్ని సవాల్‌గా తీసుకోవాలని, లేకపోతే అది పెరుగుతుందే తప్ప తగ్గదని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకుంటే పరిష్కారం సులువు అవుతుందని స్పష్టం చేశారు. ‘‘మన రాష్ట్ర మహిళా శక్తిని రుజువు చేసే సమయం, అవకాశం వచ్చాయి... మొబైల్ బ్యాంకింగ్‌లో మన రాష్ట్ర డ్వాక్రా మహిళలు దేశానికే రోల్ మోడల్‌గా నిలవాలి, నగదు రహిత లావాదేవీలవైపు ప్రజలను ప్రోత్సహిస్తే దేశంలో అదొక చరిత్రగా మిగిలి పోతుంది’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సెర్ఫ్, మెప్మా అధికారులు, ప్రాజెక్టు డైరెక్టర్లు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలోని 90 లక్షల మంది డ్వాక్రా మహిళల్లో 70 లక్షల మందికి బ్యాంకు ఖాతాలున్నాయని, 20 శాతం మందికి రూపే కార్డులున్న విషయం ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ‘పసుపు కుంకుమ’ కింద ఇస్తున్న రూ.3వేలను మహిళల రూపే కార్డులలో వేసుకంటే 90 శాతం యాక్టివేట్ అవుతాయన్నారు. డిసెంబర్ కల్లా ప్రతి డ్వాక్రా మహిళ మొబైల్ బ్యాంకింగ్‌లో తర్ఫీదు పొందాలన్నారు. శిక్షణ పొందిన 5వేల మంది మహిళలు మిగిలిన 90 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. సెర్ఫ్, మెప్మా విభాగాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాలను (టెక్నాలజీ టీములను) నియమించాలని ఆదేశించారు. ప్రతి గ్రామ సంఘాన్ని, ప్రతి పట్టణ సంఘాన్ని, మహిళా సమాఖ్యలను సెన్సిటైజ్ చేయాలన్నారు.