ఆంధ్రప్రదేశ్‌

మైనార్టీల సంక్షేమానికి పాటుపడింది మేమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ఐటి, మైనార్టీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. 2015-16 బడ్జెట్‌లో ముస్లిం మైనార్టీల కోసం రూ.376 కోట్లు కేటాయిస్తే రూ.362 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. మంగళవారం శాసనసభలో మైనార్టీల సంక్షేమ పద్దుపై జరిగిన చర్చలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన అంశాలకు మంత్రి పల్లె వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష నేత జగన్ ముస్లిం మైనార్టీలకు మేలు జరగకుండా మాట్లాడ్డం మంచిది కాదని మంత్రి అన్నారు. వైఎస్ హయాంలో కేవలం రూ.65 కోట్లకు మించి మైనార్టీలకు నిధులు కేటాయించలేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం గత ఏడాది కేటాయించిన నిధుల్లో 90 శాతం ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అవసరమైతే దేనికి ఎంత ఖర్చు చేశామో కూడా వివరణ లిఖిత పూర్వకంగా ఇస్తామని చెప్పారు. అంతకుముందు ఐటి రంగంపై మంత్రి ఇచ్చిన సమాధానం పట్ల వైఎస్ జగన్ అభ్యతరం వ్యక్తం చేశారు. ఐటి రంగాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు అని గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే ఐటి రంగం ఆదాయం వైఎస్ హయాంలో ఎక్కువగా వచ్చిందని అన్నారు. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జగన్ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరగా స్పీకర్ అనుమతించకపోవడంతో వైకాపా సభ్యులంతా స్పీకర్ పోడియంను చుట్టుముట్టి గొడవ చేశారు. అయినా స్పీకర్ పట్టించుకోకుండా టిడిపి సభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్రకు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో ఆయన మాట్లాడారు.
శాంతిభద్రతలు కాపాడుతాం
రాష్ట్రంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని హోమంత్రి చినరాజప్ప చెప్పారు. హోంశాఖ పద్దుపై చర్చకు ఆయన సమాధానమిస్తూ గ్రేహౌండ్స్‌ను పటిష్టం చేయడం ద్వారా తీవ్రవాదాన్ని పూర్తిగా అరికట్టగలుగుతున్నామని చెప్పారు.