ఆంధ్రప్రదేశ్‌

మార్చి 2నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1:ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు మార్చి 17నుంచి ఏప్రిల్ 1 వరకూ, ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1నుంచి 17వ తేదీ వరకూ జరగనున్నాయి. ఏపిలో ఇంటర్ పరీక్షలను తెలంగాణ పరీక్షల షెడ్యూలు సమయంలోనే నిర్వహించనున్నారు. గత రెండేళ్లుగా రెండు రాష్ట్రాల్లో ఒకే తేదీ, ఒకే సమయంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో దాదాపు ఒకే సిలబస్, ప్రశ్నాపత్రం తీరు ఒకే రకంగా ఉండటంతో పరీక్షలను వేర్వేరుగా నిర్వహిస్తే పేపర్ లీక్ వదంతులకు తావిచ్చినట్టవుతుందని అధికారులు భావిస్తున్నారు.
టెన్త్ షెడ్యూల్ ఇదీ: మార్చి 17న గ్రూప్-ఎ, కాంపోజిట్ కోర్సు లాంగ్వేజి పేపర్-1, 18న పేపర్-2, మార్చి 20న సెకండ్ లాంగ్వేజి, 21న ఇంగ్లీషు పేపర్-1, 22న ఇంగ్లీష్ పేపర్-2, 23న మాథ్స్ పేపర్-1, 24న మాథ్స్ పేపర్-2, 25న జనరల్ సైన్స్ పేపర్-1, 27న జనరల్ సైన్స్ పేపర్-2, 28న ఎస్‌ఎస్ పేపర్-1, 30న ఎస్‌ఎస్ పేపర్-2, 31న ఒఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజి పేపర్-2, ఏప్రిల్ 1న ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్సు పరీక్షలు జరుగుతాయి. పరీక్షల షెడ్యూలుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
ఇంటర్ ఫస్టియర్ షెడ్యూల్: మార్చి 1న సెకండ్ లాంగ్వేజి పేపర్-1, 3న ఇంగ్లీషు పేపర్-1, 6న మాథ్స -1, బోటనీ-1, సివిక్స్-1, సైకాలజీ-1, 8న మాథ్స్-1బి, జువాలజీ -1, హిస్టరీ-1, 10న ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1, క్లాసికల్ లాంగ్వేజి-1, 13న కెమిస్ట్రీ-1, కామర్స్-1, సోషియాలజీ-1, ఫైన్ ఆర్ట్సు-1, 15న జియాలజీ-1, హోంసైన్స్-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, లాజిక్-1, బ్రిడ్జికోర్సు బైపిసికి మాథ్స్-1, 17న మోడర్న్ లాంగ్వేజి -1, జియోగ్రఫీ-1 పరీక్షలు జరుగుతాయి.
ఇంటర్ సెకండియర్ షెడ్యూల్: మార్చి 2న సెకండ్ లాంగ్వేజి-2, 4న ఇంగ్లీషు-2, 7న మాథ్స్-2ఎ, బోటనీ-2, సివిక్స్-2, సైకాలజీ-2, 9న మాథ్స్-2బి, జువాలజీ-2, హిస్టరీ-2, 11న ఫిజిక్స్-2, ఎకనామిక్స్-2, క్లాసికల్ లాంగ్వేజి-2, 14న కెమిస్ట్రీ-2, కామర్స్-2, సోషియాలజీ-2, ఫైన్ ఆర్ట్సు-2, 16న జియాలజీ -2, హోంసైన్స్-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, లాజిక్-2, బ్రిడ్జికోర్సు మాథ్స్ (బైపిసి)-2, 18న మోడర్న్ లాంగ్వేజి పేపర్-2, జియాగ్రఫీ పేపర్-2 నిర్వహిస్తారు.