ఆంధ్రప్రదేశ్‌

నేడు ఢిల్లీకి బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 2: రెండు రోజుల పాటు జరుగునున్న హెచ్‌టి లీడర్‌షిప్ సమ్మట్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. భారత దేశానికి కావాల్సిన మార్పులు అన్న అంశంపై జరుగునున్న సమ్మిట్‌లో పాల్గొంటున్న 21 మంది ప్రముఖుల్లో చంద్రబాబు ఒకరు. ఈ సమ్మిట్‌లో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్, పీయూష్ గోయల్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటుడు అమితాబ్ బచ్చన్ తదితరులు పాల్గొననున్నారు.