ఆంధ్రప్రదేశ్‌

తెలుగు రాష్ట్రాల్లో 7 మెగా ఫుడ్ పార్క్‌లకు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,డిసెంబరు 2: రెండు తెలుగు రాష్ట్రాలలో ఏడు మెగా ఫుడ్‌పార్కులకు 2008-15మధ్య ఆమోదం తెలిపినట్టు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి శుక్రవారం వెల్లడించారు. ఏపీలోశ్రీని ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెట్,చిత్తూరు, గోదావరి మెగా ఆక్వా పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్,కృష్ణా జిల్లాల్లో ఆమోదించినట్లు వెల్లడించారు. అలాగే తెలంగాణలో స్మార్ట్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, నిజామాబాద్, రాగ మయూరి ఆగ్రోవెట్ ప్రైవేట్ లిమిటెడ్,మహబుబ్‌నగర్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఖమ్మం జిల్లాల్లో ఆమోదించినట్టు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.