ఆంధ్రప్రదేశ్‌

నోట్ల రద్దు చారిత్రాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 2: నోట్లరద్దు, బంగారంపై నియంత్రణ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలని వీటివల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ శాశ్వత ప్రయోజనం కలుగుతుందని బిజెపి నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరు మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ నోట్ల రద్దుతో ఇబ్బందులు తప్పవని ప్రధాని ముందుగానే హెచ్చరించారని గుర్తుచేశారు. అయితే ప్రతిపక్షాలు రాజకీయం కోసం రాద్ధాంతం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. త్వరలోనే ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. నల్లధనం వెలికితీత ద్వారా సామాన్యుల కడగండ్లు తీర్చాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కార్పొరేట్ శక్తులకు ఎవరు కొమ్ముకాస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. సిపిఐ కార్యదర్శి నారాయణ ప్రధానమంత్రి మోదీపై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. ఓ సీనియర్ రాజకీయ నాయకునిగా నారాయణ తన స్థాయిని మరచి విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. బేఠీ బచావో- బేఠీ పఢావో, సుకన్య సురక్ష యోజన తదితర పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. మిత్రపక్షంగా ఉంటూనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. నన్నపనేని పరిస్థితుల పట్ల అవగాహన కలిగి మాట్లాడాలని హితవు పలికారు. మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నోట్ల రద్దు కార్పొరేట్ శక్తులను కాపాడేందుకే అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. దేశ సరిహద్దుల్లో తీవ్రవాదులు ప్రజలను మట్టుపెడుతుంటే సర్జికల్ దాడులతో అంతమొందించినప్పుడు ప్రధానిని వేనోళ్ల పొగిడిన నేతలు నోట్ల రద్దు విషయాన్ని రాద్ధాంతం చేయటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. సమావేశంలో రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి జూపూడి రంగరాజు, అర్బన్ అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు, ఈదర శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.