ఆంధ్రప్రదేశ్‌

డ్వాక్రా సంఘాలు నాకు ప్రాణసమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, డిసెంబర్ 2: ‘నేను నాటిన విత్తు...నా ప్రాణ ప్రతిష్ట డ్వాక్రా సంఘాలు...ఆనాడు నా తల్లి పడ్డ కష్టాన్ని చూశా...సమాజంలోని ఆడపడుచుల ఇబ్బందులు గమనించా...అందుకే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఓ వ్యవస్థలా మార్చాను’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో డ్వాక్రా సంఘాలను మరింత బలోపేతం చేసి ఆడపడుచులను ఉన్నత స్థాయికి చేర్చే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుంటున్నట్లు హర్షధ్వానాల నడుమ ప్రకటించారు. అనంతపురం జిల్లా మడకశిరలో శుక్రవారం సాయంత్రం జరిగిన చంద్రన్న పసుపు కుంకుమ కార్యక్రమంలో సిఎం మాట్లాడుతూ ఆనాడు తాను నాటిన విత్తనం డ్వాక్రా సంఘాలు ప్రపంచానికే ఆదర్శమవుతున్నాయన్నారు. దాదాపు 90 లక్షల మంది సభ్యులతో ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు అన్నింటా ఆదర్శప్రాయమవుతున్నాయన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల పాటు డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసిందని చంద్రబాబు విమర్శించారు. సమాజంలో 50 శాతం దాకా ఉన్న ఆడబిడ్డలు అనాదిగా ఇతరులపై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొందని, ఇది గమనించి రూపకల్పన చేసిన డ్వాక్రా సంఘాలు నేడు అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్నాయన్నారు. పేదరికం లేని సమాజంగా తీర్చిదిద్దడమే తన జీవితాశయం అన్నారు. అందుకు డ్వాక్రా సంఘాలు, వెలుగు ఉద్యోగులు తెలుగుదేశం ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించి సమాజ సంక్షేమానికి కంకణబద్ధులవ్వాలన్నారు. డ్వాక్రా సంఘాలకు రెండో విడతగా ప్రస్తుతం రూ.800 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఒక్కో సభ్యురాలికి రూ.10 వేల వంతున నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామన్నారు. మొదటి విడత తరహాలో కాకుండా రెండో విడత మంజూరు చేస్తున్న ఈ పథకాన్ని వారు ఏ అవసరాలకైనా వినియోగించుకోవచ్చన్నారు. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక లావాదేవీల్లో సామాన్యులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్య తీర్చాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. నగదు రహిత లావాదేవీల్లో దేశానికే ఆదర్శం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ బాధ్యతను ప్రతి పౌరుడు సామాజిక సేవగా చేపట్టి అవినీతి రహిత సమాజానికి తోడ్పాటునందివ్వాలని కోరారు. టిడిపి శ్రేణులు సైతం గ్రామస్థాయి నుండి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి వారిలో అవగాహన పెంచాలన్నారు. నగదు రహిత లావాదేవీలకు స్వయం సహాయక సంఘాలు సహకారం అందివ్వాలన్నారు. ప్రపంచంలో ఉన్న పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చి మరో ఏడాదిలోగా నగదు రహిత కార్యకలాపాలకు శ్రీకారం చుడతామన్నారు. కోటి 34 లక్షల పేద కుటుంబాలకు రూ.385 కోట్ల వ్యయంతో సంక్రాంతి పండుగ జరుపుకొనేందుకు సంక్రాంతి కానుక కింద నిత్యావసరాలను ఉచితంగా అందచేయనున్నామన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.250 విలువ చేసే ఆరు నిత్యావసరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

చిత్రం..మడకశిరలో జరిగిన చంద్రన్న పసుపు కుంకుమ సభలో సిఎంకు రాఖీ కడుతున్న డ్వాక్రా మహిళలు