శ్రీకాకుళం

జలకాలుష్యం కోరల్లో సిక్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 30: లక్షలాది మంది ప్రజలు సురక్షిత తాగునీటిని తీసుకోలేకపోతున్నారు. అపరిశుభ్రత పడగలో పల్లెలు విలవిలలాడుతున్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యాన్ని చేరుకోలేని పంచాయతీలు. బహిరంగ మలవిసర్జన స్వచ్ఛ్భారత్ నినాదాన్ని నిలువెత్తున దహించేలా చేస్తున్నాయి. వౌఖిక మంత్రంతో ప్రతీ పల్లె, వార్డు అభివృద్ధి చేస్తున్నట్టు గణాంకాలు చూపుతున్న అధికారులు..వారి కాకిలెక్కలే ఆధారంగా జిల్లాను ఎంతో అభివృద్ధి చేసామంటూ ప్రజాప్రతినిధులు ఉదరొగొట్టే స్పీచ్‌లు..అన్నీ అవాస్తవాలేనంటూ యూనిసెఫ్ అధ్యయన నివేదికలో తేటతెల్లమైంది. శ్రీకాకుళం జిల్లాలో సురక్షిత తాగునీటి వినియోగం, పారిశుద్ధ్యం స్థితిగతులు చిట్టచివరి స్థానంలో ఉన్నట్లు యూనిసెఫ్, సెంట్రల్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ సంయుక్తంగా రాష్ట్రంలో నియోజకవర్గాలవారీగా చేసిన అధ్యయనంలో ‘శ్రీకాకుళానికి కాలుష్యం కాటేసింది’ అంటూ చెప్పుకురావడం బాధాకరం. అభివృద్ధి అంటున్న అధికారులు, పాలకులు తాగునీటిని రక్షించలేకపోతున్నారు. అతితక్కువ రక్షిత తాగునీటి వల్ల 80 శాతం మంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. కలుషుతిమైన త్రాగునీటిని తీసుకోవడమే ప్రధాన కారణం అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల జిల్లాలో ప్రతీ రెండు శాతం సాధారణ మరణాలతో పాటు కలుషిత నీటిని తాగడం వల్ల వచ్చే మరణాలు కూడా వీటిలో కలిసిపోతున్నాయంటూ యూనిసెఫ్ నివేదికలు సిక్కోల్ కాలుష్య రక్కసిని విఫులంగా వివరించింది. శ్రీకాకుళం జిల్లా తాగునీటి సౌకర్యాన్ని 15.57 శాతం మాత్రమే వినియోగించుకుని రాష్ట్రంలో చిట్టచివరి 13వ ర్యాంకులో ఉంది. అలాగే, స్వచ్ఛ్భారత్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు శతశాతం జరగాలంటూ అనునిత్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం సంబంధిత అధికారులకు, సిబ్బందికి సమావేశాలు నిర్వహించి, గ్రామాల్లో పర్యవేక్షిస్తూ చెప్పే మాటలు సిక్కోల్ యంత్రాంగానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు వంటపట్టడంలేదు. అందుకే - పారిశుద్ధ్యం సౌకర్యంలో కూడా 21.24 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకుని 13వ ర్యాంకులోనే ఉండిపోయింది. రాష్ట్రంలో గల 13 జిల్లాల్లో విశాఖపట్నం ఐదో స్థానంలో ఉండగా, విజయనగరం 12వ స్థానంలో, శ్రీకాకుళం చిట్టచివరి స్థానమైన 13వ స్థానంలో ఉందని యూనిసెఫ్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నివేదికలు అసెంబ్లీలో సభ్యులకు రెండురోజుల క్రితం అందజేసారు.
ఇదిలా ఉండగా, జిల్లాలో అవినీతిరహిత పాలన, అభివృద్ధి గమ్యం, వౌకిక మంత్రం వంటి అంశాలతోనే రాజకీయ ర్యాంకులు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు యూనిసెఫ్ నివేదికలతో ఆయన ర్యాంకులు తారుమారయ్యేలా కన్పిస్తోంది. అత్యంత గొప్పగా చెప్పుకునే నెంబర్ 1 అసెంబ్లీ స్థానంలో శ్రీకాకుళం నియోజకవర్గం ఉండగా, యూనిసెఫ్ నివేదికలు ఆధారంగా అట్టడుగు వరుసలో మొదటి ర్యాంకుగా మారిపోయింది. సాక్షాత్తు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గం 5వ ర్యాంకులో నిలబడింది. ఇచ్చాపురం రెండో ర్యాంకులో, పలాస 4వ ర్యాంకులో, నరసన్నపేట 3వ ర్యాంకులో, ఎచ్చెర్ల 8వ ర్యాంకులో, రాజాం మొదటి ర్యాంకులో, పాలకొండ 9వ ర్యాంకులో, పాతపట్నం 7వ ర్యాంకుగా, ఆమదాలవలస ఆరో ర్యాంకులో అక్కడ సురక్షిత తాగునీటి వినియోగం, పారిశుద్ధ్యం తదితర స్థితిగతులపై నివేదికలు సుస్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు దత్తత తీసుకున్న సంతబొమ్మాళి గ్రామంలో కూడా సురక్షిత తాగునీరు, పారిశుద్ధ్యంపై ఇంకా శతశాతం లక్ష్యాలు చేరుకోలేదు. వర్మీ కంపోస్టు యార్డును పది లక్షల రూపాయలతో నిర్మించారే తప్ప, వౌకిక మంత్రం అనుకున్నంతగా ఫలించలేదు. అదనపు భవనాలు నిర్మాణాలు లేవ్. పారిశుద్ద్యం చెప్పుకున్నంత మెరుగుపడలేదు. ఎన్టీఆర్ సుజలధార ద్వారా అక్కడ ప్రజలకు రక్షిత తాగునీరు అందిస్తున్నారు. కాని - యూనిసెఫ్ అధ్యయనంలో ప్రత్యేకంగా ఎం.పి. దత్తత గ్రామాల కోసం ప్రస్తావించకపోవడంతో అక్కడ ర్యాంకింగ్ విధానాన్ని నివేదికల్లో సుస్పష్టం కాలేదు. మునుపటి కంటే ఎం.పి. దత్తత తీసుకున్న తర్వాత 42.71 శాతం రక్షిత తాగునీరు, పారిశుద్ధ్యం లక్ష్యాలను చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ నివేదికలైతే సుస్పష్టంగా చెబుతున్నాయి. ఏదిఏమైనప్పటికీ ‘సురక్షిత తాగునీరు ప్రాధమికమైన మానవ అవసరం..కనీస మానవహక్కు -యూనిసెఫ్’ చెప్పినట్లు శ్రీకాకుళంలో ఎక్కడా కానరావడం లేదు!?‚

వైద్య ఆరోగ్యశాఖలో బయోమెట్రిక్ లొల్లి!

శ్రీకాకుళం(టౌన్), మార్చి 30: వైద్య ఆరోగ్య శాఖలో ఏప్రియల్ ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్ విధానం అమల్లోకి రానుంది. వైద్య ఆరోగ్య సిబ్బందిలో పారదర్శక సేవల విధానం అందుబాటులోకి తీసుకురావాలని ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ విధానం మంచిపద్దతే అయినా, క్షేత్రస్థాయి సిబ్బందిలో మాత్రం అయోమయం నెలకొంది. క్షేత్రస్థాయిలో తాము విధుల్లో ఉండగా సమయపాలన ఉండదని, ఒక్కో పర్యాయం రవాణా సదుపాయం లేక గ్రామాల్లోనే ఉండి పోవలసి ఉంటుందని, అటువంటి సమయంలో ఏ విధంగా బయోమెట్రిక్ నమోదు చేయగలమని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుంటే క్షేత్రస్థాయి సిబ్బంది సైతం ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల హెడ్‌క్వార్టర్లలోనే నివాసం ఉంటారని, అటువంటపుడు విధులకు బయలుదేరే ముందు బయోమెట్రిక్ వేసి వెళ్లడం వలన పోయేదేమి లేదని, తప్పకుండా బయోమెట్రిక్ నమోదు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. పిహెచ్‌సిలకు సుధూర ప్రాంతాల గ్రామాల్లో సేవలందించేందుకు సరైన రవాణా సదుపాయం అందుబాటులో లేకపోవడంతో రెండు, మూడు రోజులు పిహెచ్‌సికి రావడం కుదరదని క్షేత్రసిబ్బంది వాదిస్తున్నారు. ఇందుకు సింగుపురం పిహెచ్‌సి నుండి ఇప్పిలి ఉపకేంద్రం, ఎల్. ఎన్.పేట నుండి కొండచొర్లంగి, రాయమానుగూడ ప్రాంతాలకు వెళ్లి, రావడం, గుత్తావల్లి నుండి మసాన్‌పుట్టి పరిసర ప్రాంతాలు, గుప్పెడిపేట నుండి వాటి ఉపకేంద్రాలు వంటివి సుమారు జిల్లాలో 16 వరకు ఉన్నాయని ఆయా కేంద్రాల నుండి వెళ్లి రావాలంటే సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందని వారు వాపోతున్నారు. అటువంటి ప్రత్యేక సమయం వచ్చినపుడు చూసుకుందామంటూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు దాటవేత దోరణి అవలంభించడం ఉద్యోగుల్లో మరింత ఆందోళన కలిగిస్తుంది. క్షేత్ర సిబ్బందికి బయోమెట్రిక్ నుంచి వెసులుబాటు కల్పించడం ద్వారా పోయేదేమీ లేదని, ప్రస్తుతం క్షేత్ర సిబ్బంది సేవలన్నీ ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయాల్సి ఉన్నందున దానినే ప్రాతిపదికగా తీసుకోవాలని వారు కోరుతున్నారు. అయితే ఇటువంటి వాటి ద్వారా పారదర్శకత ఉండదని తప్పకుండా ప్రతి ఒక్కరు పిహెచ్‌సి కేంద్రం నుండే బయలుదేరాలన్న ఉన్నతాధికారుల పట్టుదలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో బయోమెట్రిక్ లొల్లి తారాస్థాయికి చేరుకుంది.
క్షేత్ర సిబ్బంది పిహెచ్‌సిలో బయోమెట్రిక్ నమోదు చేయాల్సిందే : డిఎంహెచ్‌ఒ
క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది వైద్య సేవలందించేందుకు గ్రామాలకు వెళ్లే సమయంలో తప్పకుండా బయోమెట్రిక్ నమోదు ఉండాలని, అంతమాత్రాన సేవల్లో జాప్యం ఏమీ ఉండదని డియంహెచ్‌వో డాక్టర్ ఆర్.శ్యామల తెలిపారు. పిహెచ్‌సి పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది హెడ్‌క్వార్టర్స్‌లో నివాసం ఉండాలన్న నిబంధన మేరకు వారు ఏ గ్రామానికి వెళ్లినా పిహెచ్‌సి నుంచే బయలుదేరాల్సి ఉందన్నారు.

ఎన్టీఆర్ గృహ కల్ప కింద
6 లక్షల ఇళ్లు మంజూరు
సీతంపేట, మార్చి 30: ఎన్టీఆర్ గృహ కల్ప పథకం కింద జిల్లాలో 6లక్షలు గృహాలు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీనృసింహం తెలిపారు. బుధవారం సీతంపేట విచ్చేసిన కలెక్టర్ స్థానిక ఐటిడి ఎ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. ఏప్రిల్ 14 తేదీన అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని గృహా కల్పన పథకానికి శంకుస్థాపన చేస్తామన్నారు. ఎన్టీఆర్ గృహ కల్ప పథకంలో యూనిట్ ధర రూ.2.75 లక్షలు కాగా వీటిలో రూ.1.75 లక్షలు ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ అందిస్తూ రూ.1 లక్ష వరకు రుణం వర్తిస్తుందన్నారు. అలాగే ఇతరులకు రూ.2.75 లక్షలు యూనిట్ ధరకు రూ.1.25 లక్షలు సబ్సిడీ రూపంలోను, మిగిలిన రూ.1.50 లక్షలు రుణం కింద లబ్ధిదారులకు వర్తిస్తుందన్నారు. 270 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పథకం కింద గృహం నిర్మించుకోవడానికి స్థలం ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీల లబ్ధిదారులు ఆయా మండలాల ఎంపిడివో కార్యాలయాల్లో ఎన్టీ ఆర్ గృహ కల్పనకు సంబంధించిన దరఖాస్తులు పొందాలని సూచించారు.

అడవుల సంరక్షణ అందరి బాధ్యత
సీతంపేట, మార్చి 30: అడవిని కాపాడుకోవాల్సిన ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ లక్ష్మీనృసింహం అన్నారు. బుధవారం సీతంపేట విచ్చేసిన ఆయన స్థానిక ఐటిడి ఎ కార్యాలయంలో డి ఎల్‌సి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 780 జీడి ప్రోససింగ్ యూనిట్లు ఉన్నప్పటికీ 20 శాతం జీడి పంట కూడా రావడంలేదని అన్నారు. పంట సంజీవని పథకం కింద 2500 నీటి కుంతలు తవ్వకాలు చేయాలన్నారు. అలాగే ఎన్టీ ఆర్ జలసిరి పథకం కింద బోరు బావులు తవ్వించాలని సూచించారు. గిరిజన గ్రామాల్లో గిరిజనులకు ఆర్థిక చేయూతనివ్వడానికి కోళ్ల పెంపకం ద్వారా కోడి గ్రుడ్లు సరఫరా 20వేలు కుటుంబాలు జరగాలన్నారు. నీటి కుంతలు నమూనాలు గ్రామస్థాయిలో తవ్వి గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రకృతి వైద్యానికి ఉపయోగపడే మొక్కలు పెంచాలని సూచించారు. వలస వచ్చిన గిరిజనులకు అటవీహక్కు ఉండదని, అటువంటి వారికి అటవీసాగు హక్కు పత్రాలు కూడా ఇవ్వరాదన్నారు. కొండ పొడు పట్టాలిచ్చిన భూముల్లో లవాంగాలు, మిరియాలు, ఏలకులు వంటి సుంగద ద్రవ్యాలు పండించాలన్నారు. వి ఎస్ ఎస్ భూములలో కమ్యూనిటీ పట్టాలివ్వడానికి ఎట్టిపరిస్థితుల్లోను అవకాశం లేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో అక్రమమైనింగ్ ఎక్కడ జరిగినా తమకు తెలియజేయాలన్నారు. ఈ ఏడాది జూన్ నెలలో కేరళ రాష్ట్రం నుంచి రైతులను తీసుకువచ్చి సుగంద ద్రవ్యాలు సాగునకు మెళుకువలు నేర్పించటం జరుగుతుందన్నారు. ఐటిడి ఎ ద్వారా గిరిజనులకు పంపిణీ చేయనున్న 8,800 ఎకరాల్లో జిపి ఎస్ సర్వే ఆధారంగా ఇబ్బందులు ఉంటే వచ్చే నెల 3తేదీలోగా తమకు తెలియజేయాలని అటవీశాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. వచ్చే నెలలో గిరిజన ఉత్సవాలు సీతంపేటలో జరుగుతాయని, ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రితోపాటు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు చేతులుమీదుగా 3436 మంది గిరిజన లబ్ధిదారులకు అటవీసాగు హక్కు పట్టాలు పంపిణీ చేపడతామన్నారు. అనంతరం గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఐ ఎ పి నిధులతో జరుగుతున్న నిర్మాణ పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
పోస్టరు ఆవిష్కరణ
వచ్చే నెల 6,7 తేదీల్లో సీతంపేటలో నిర్వహించనున్న గిరిజన ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ లక్ష్మీనృసింహం అవిష్కరించారు. గిరిజన సాంస్కృతిక, సంప్రదాయాలకు అద్దంపట్టేలా గిరిజన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఐటిడి ఎ పివో జల్లేపల్లి వెంకటరావు, జిల్లా అటవీశాఖాధికారి శాంతిస్వరూప్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు సవరతోట ముఖలింగం, టి డబ్ల్యూ ఇ ఇ ఎస్.శ్రీనివాసరావు, అటవీశాఖాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అవార్డులు బాధ్యతలను పెంచుతాయి : డిఎంహెచ్‌ఓ
శ్రీకాకుళం(టౌన్), మార్చి 30: జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు రాష్ట్ర స్థాయిలో ఆసుపత్రి ప్రసవాలు పెంచడం, పారిశుద్ధ్య నిర్వహణ ద్వారా రోగాల నియంత్రణ, పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి సరైన రీతిలో ఐరన్ మాత్రలు అందజేసి, వారిలో లోపనివారణకు కృషిచేసినందుకు గాను మూడు అవార్డులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బుధవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో భాగంగా ఎపి ఎంపిహెచ్‌ఈవో, సిహెచ్‌వో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్.శ్యామలకు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తుమ్మిడి సోమేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఒకే జిల్లాకు మూడు విభాగాల్లో అవార్డులు రావడమనేది ఇదే మొదటిసారి అన్నారు. అందుకు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంతా గర్వపడుతున్నామన్నారు. అయితే ఇందుకు డిఎంహెచ్‌వో డాక్టర్ శ్యామల కృషి లేకపోలేదని, ఆమె శ్రమ ఫలితంగా సిబ్బంది కష్ట్ఫలితమే అవార్డు అన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇప్పిలి నారాయణరావు మాట్లాడుతూ ఇదే స్పూర్తిని భవిష్యత్‌లో కనబర్చాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. అవార్డు గ్రహీత డిఎంహెచ్‌వో డాక్టర్ శ్యామల మాట్లాడుతూ అవార్డు రావడంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బగాది జగన్నాధరావు, నోడల్ అధికారి డాక్టర్ మెండ ప్రవీణ్, డిప్యూటీ డియంహెచ్‌వో డాక్టర్ దవళ భాస్కరరావు, జిల్లా మలేరియా అధికారి ఎ.అరుణకుమార్, అసోసియేషన్ నేతలు శిమ్మ సోమేశ్వరరావు, కె.వి.నారాయణరావు, వై.శ్రీనివాసరావు, జి.జగన్నాథం, సిహెచ్.వెంకటరావు, బమ్మిడి నర్శింగరావు, శాంతారాం తదితరులు పాల్గొన్నారు.

నేరస్థులపై ప్రత్యేక నిఘా
సారవకోట, మార్చి 30: గ్రామాలలో నేరస్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని వీరిపై తమ శాఖ ప్రత్యేక నిఘా పెట్టిందని పాలకొండ డిఎస్పీ సి హెచ్ ఆదినారాయణ స్పష్టంచేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్ తనిఖీ కోసం బుధవారం వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు. గొలుసు చోరీలు, ఆలయాలలో చోరీ తదితర నేరాలు ఇటీవల గణనీయంగా పెరిగాయన్నారు. స్థానికులు, స్థానికేతరులు కూడా ఈనేరాలకు పాల్పడుతున్నారని ఆయన వివరించారు. వేసవిలో సాధారణంగా జరిగే దొంగతనాలను అరికట్టడానికి రాత్రి సమయాలలో గస్తీని పెంచుతున్నామన్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు కూడా నేరాలకు పాల్పడుతండటం శోచనీయమన్నారు. డబ్బుకోసం విద్యార్థులు నేరాలకు పాల్పడటం జరుగుతుందని తమ దర్యాప్తు వెల్లడైందని ఆయన వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయన్నారు. కార్డన్ సెర్చ్ వలన గ్రామాలలో నేరస్తులు, దొంగవస్తువుల ఆచూకి తెలుస్తుందని ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల ప్రజలు పోలీసుశాఖతో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వాహనాలు వేగంగా నడపడం వలన ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. వాహనాల వేగాన్ని కనుగొని అదుపుచేయడానికి జిల్లాకు ఇంటర్‌సప్టర్ అనే యంత్రం అమర్చిన ప్రత్యేక వాహనాన్ని ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు. దీని వలన అతి వేగాన్ని నిరోదించడానికి అవకాశం ఉందన్నారు. పాతపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌జె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. తొలుత పోలీస్‌స్టేషన్‌లో రికార్డులు పరిశీలించి పలు సూచనలిచ్చారు.

ఉగాది వేడుకలకు రూ.25 లక్షలు
శ్రీకాకుళం(కల్చరల్), మార్చి 30: దుర్ముఖినామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.25లక్షలు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలను మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పంచాంగ శ్రవణం, కవిసమ్మేళనం, లబ్ధప్రతిష్ఠలకు సన్మానం, సంస్కృతిక కార్యక్రమాలు వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మండల స్థాయిలోనూ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలుగుదనం ఉట్టిపడేలా అన్ని కార్యక్రమాలు ఉండాలన్నారు. ఇందుకు మండల స్థాయి అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా స్థాయిలో జరిగే కవి సమ్మేళనంలో పాల్గొనే అభ్యర్థులు జిల్లా పౌరసంబంధాల అధికారి, సమాచార పౌరసంబంధాల శాఖ, అఫీషియల్ కాలనీ శ్రీకాకుళం వారికి, మండల స్థాయిలో జరిగే కవిసమ్మేళనంలో పాల్గొనేందుకు సంబంధిత ఎంపిడివోలకు తమ కవితలు సమర్పించాలన్నారు. కవితల్లో తెలుగుదనం, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించాలని, ఏ వ్యక్తిని, సంస్థను, వ్యవస్థను విమర్శించే విధంగా కవితలు ఉండరాదని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 5లోగా కవితలు అందజేయాలని, న్యాయ నిర్ణేతలుగా నియమించే కమిటీ పరిశీలించి పది కవితలను ఎంపిక చేసి ఉగాది వేడుకల వేదికపై చదివి వినిపించే అవకాశం కల్పిస్తుందని తెలిపారు.

కొరియా భాష నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు
ఎచ్చెర్ల, మార్చి 30: అంబేద్కర్ వర్శిటీలో త్వరలో ప్రారంభించనున్న కొరియాకోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వైస్ చాన్సలర్ హెచ్ లజపతిరాయ్ స్పష్టంచేశారు. దక్షిణ కొరియాలోని హాన్ సంగ్ విశ్వవిద్యాలయం ప్రతినిధి కాంగ్ జాన్ ఆన్‌తో కొరియా భాషా ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు బుధవారం ఎంఓయు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా వీసి మాట్లాడుతూ ఏడాది కోర్సు పూర్తిచేసిన వారికి హాన్ సంగ్ వర్శిటీ పీజికోర్సును ఆఫర్ చేస్తుందన్నారు. ఈ భాష మూడు నెలలు, ఏడాది డిప్లమో కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తామన్నారు. ఈ కోర్సుకు సంబంధించిన టెక్నికల్ నైపుణ్యం పొందగలిగితే కొరియాలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఐటిఐ లో డీజిల్ మెకానిక్, వైండింగ్, వెల్డింగ్, ఫిట్టర్, సెలఫోన్ తయారీ, ఎలక్ట్రీషియన్ కేటగిరికి చెందిన వారు కొరియా కోర్సు నేర్చుకుంటే ఉద్యోగాలు పొందవచ్చునన్నారు. టెస్ట్ ఆఫ్ ఫెర్ఫార్మినెస్ ఇన్ కొరియా(టాపిక్) పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చి హేన్ సంగ్ వర్శిటీ స్కాలర్ అందజేస్తుందని అలాగే మరిన్ని అవకాశాలు పొందేలా గైడెన్స్ ఇస్తుందని కాంగ్ జాన్ ఆన్ తెలియజేశారు.
అకడమిక్ బ్లాక్‌లో జరిగిన ఈ సమావేశంలో రెక్టార్ ఎం.చంద్రయ్య, రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్, ప్రిన్సిపల్ జి.తులసీరావు, డీన్ టి.కామరాజు, ప్రొఫెసర్ అడ్డయ్య, అనువాదకుడు ప్రశాంత్, ట్రావెల్ అసోసియేషన్ ప్రతినిధి నటుకుల మోహన్‌లు ఉన్నారు.

పశువులశాలకు నిప్పు
ఎచ్చెర్ల, మార్చి 30: మండలంలోని అరిణాం అక్కివలస గ్రామంలో వ్యక్తిగత కక్షలు పరాకాష్టకు చేరడంతో చిక్కాల సూర్యనారాయణకు చెందిన పశువుల శాలకు అదే గ్రామానికి చెందిన గట్టిం అప్పారావు బుధవారం వేకువజామున నిప్పటించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘనటలో రెండు ఆవులు సజీవదహనం కాగా మరో రెండు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. అదే విధంగా ఎద్దులబండి, సైకిల్, గడ్డికుప్ప కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనకు పాల్పడిన అప్పారావుపై సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇంచార్జ్ ఎస్‌ఐ కె. ప్రసాదరావుతెలిపారు. రూ.50వేలు ఆస్తినష్టం సంభవించిందని ఎస్‌ఐ తెలిపారు.
వేర్వేరు సంఘటనల్లో
ఇద్దరికి గాయాలు
ముద్దాడ పంచాయతీ అంబేద్కర్ నగర్‌కు చెందిన వాడాడ నారాయణరావు కూరగాయలు విక్రయించేందుకు శ్రీకాకుళం వస్తుండగా బుధవారం ఉదయం గుర్తుతెలియని టాటా ఏసి తోటపాలెం సమీపాన ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా హెచ్‌సి విశే్వశ్వరరావుకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.