ఆంధ్రప్రదేశ్‌

‘బౌండరీలు’ దాటిన క్రికెట్ బుకీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 31: క్రికెట్ బుకీలు బౌండరీలు దాటారు. తమ సొంత ప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాలకు తరలిపోయారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, గోవా రాష్ట్రంలోని గోవా కేంద్రంగా ఈ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బెట్టింగుల మక్కాగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లాలో రకరకాల పందాలు కోట్లలో సాగుతుంటాయి. టీ-20 ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోని పోలీసులు పటిష్టమైన నిఘా సమాచారంతో వరుస దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో బుకీలు అడ్డంగా దొరికిపోతున్నారు. వారి వద్ద ఎవరెవరూ బెట్టింగ్‌లు వేస్తున్నారనే సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నారు. ఈ దాడులను తట్టుకోలేక బుకీలు పెట్టేబేడా సర్దుకుని పక్క రాష్ట్రాలకు తరలిపోయినట్లు తెలిసింది. అక్కడి నుంచే పశ్చిమగోదావరి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లు వేసే వారికి ప్రత్యేకమైన లైన్‌ను కూడా ఏర్పాటుచేసినట్లు సమాచారం.
వరుసగా పోలీసుల దాడులు
టీ-20 ప్రపంచకప్ పోటీల నేపథ్యంలో సాగుతున్న బెట్టింగులపై పశ్చిమగోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. ఎక్కడికక్కడ ఇన్‌ఫార్మర్లను ఏర్పాటుచేసింది. దీనికి తగ్గట్టుగానే భీమవరంలో కొద్దిరోజుల క్రితం హర్యానా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బుకీలను పట్టుకున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భీమవరానికి చెందిన బుకీలను పట్టుకున్నారు. వరుసగా పాలకొల్లు, ఏలూరు, తణుకు తదితర ప్రాంతాల్లో పోలీసులు దాడులు జరిపి బుకీలను పట్టుకున్నారు.
టీ-20 ప్రపంచకప్ క్రికెట్ పందాలరాయుళ్లకు అంతగా కలిసిరాలేదు. చాలావరకు మ్యాచ్‌లు నష్టాలు తీసుకువచ్చాయి. భారత్‌తో ఏ మ్యాచ్ జరిగినా ఇక ఆ పందాలకు హద్దులుండవు. ఎంతకైనా తెగించి పందాలు కాయడం పందెంరాయుళ్ల వంతు. బుధవారం జరిగిన వెస్టిండీస్ వెర్సస్ భారత మధ్య జరిగిన పోరుపై భారీస్థాయిలో పందాలు జరిగాయి. కాగా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లు బెట్టింగుల రాయుళ్లకు కలిసి రాకపోవడంతో ఫైనల్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఎంత నష్టం వచ్చినా ఫైనల్స్‌లో కవర్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.