ఆంధ్రప్రదేశ్‌

బౌద్ధం పరిఢవిల్లిన నేల అనుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 8..ఒకానొకప్పుడు బౌద్ధం పరిఢవిల్లిన నేలగా ప్రసిద్ధిగాంచి నాటి చారిత్రక కట్టడాలు పునరుజ్జీవం పోసుకుంటున్న నాగార్జునసాగర్‌కు దక్షిణ వైపున ఉన్న గుంటూరు జిల్లా అనుపు గ్రామంలో 16 వందల సంవత్సరాల తరువాత మూడురోజుల పాటు ఉత్సవాల నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు తవ్వకాల్లో అప్పట్లో బౌద్ధమతానికి సంబంధించిన అనేక పురావస్తు ఆనవాళ్లు బయల్పడ్డాయి. ఇక్కడ లభ్యమైన పురాతన వస్తువుల ఆధారంగా ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ అనుపు గ్రామంలోని 80 హెక్టార్లలో పునర్నిర్మాణాలు చేపట్టింది. పురాతన బౌద్ధ విశ్వవిద్యాలయం, హరితి దేవాలయం, యాంఫీ థియేటర్లు ఉన్నట్లు గుర్తించిన సంస్థ వీటి పునర్నిర్మాణంతో పాటు అలనాటి సాంస్కృతిక, సాంఘిక వైభవాలను చాటిచెప్పే విధంగా ఉత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ప్రముఖ ఐటి సంస్థ ఇన్‌ఫోసిస్ సౌజన్యంతో ఈ నెల 9 నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. సంగీతం, నృత్యం, జానపదం, థియేటర్‌కు సంబంధించిన 350 మంది కళాకారులు ఉత్సవాల సందర్భంగా వైవిధ్యమైన కళారూపాలను ప్రదర్శిస్తారు. ఉత్సవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇన్ఫోసిస్ చైర్మన్ సుధామూర్తితో హైటీ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. సిఎం చంద్రబాబు మధ్యాహ్నం 2.30 గంటలకు విజయవాడ నుంచి హెలీకాప్టర్‌లో బయల్దేరి 2.55 గంటలకు నాగార్జున సాగర్ చేరుకుంటారు. అధికారులు, ఉన్నతాధికారులతో కొద్దిసేపు సమీక్షిస్తారు. అనంతరం 3 గంటలకు సాగర్ నుంచి రోడ్డు మార్గాన అనుపు చేరుకుంటారు.

చిత్రం..బౌద్ధమత వైభవానికి ప్రతీకగా అనుపులో నిర్మితమవుతున్న బౌద్ధవిశ్వవిద్యాలయం, హరితి దేవాలయం