ఆంధ్రప్రదేశ్‌

హడలెత్తిస్తున్న వార్ధా తుపాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 8: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసిన అధికారులు గురువారం బందరు పోర్టులో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లవద్దంటూ హెచ్చరించారు. అల్పపీడనం రెండు మూడు రోజుల్లో తీవ్ర తుఫాన్‌గా మారి నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలియజేశారు. దీని ప్రభావంతో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ వల్ల సంభవించే ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ బాబు.ఎ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్‌లో సముద్రం కొంత మేర ఉధృతంగా కనిపించింది. తీర మండలాలైన బందరు, కృత్తివెన్ను, బంటుమిల్లి, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తుఫాన్ ముప్పు తప్పే వరకు అధికారులకు సెలవులు రద్దు చేశారు. తీర మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించటంతో పాటు పునరావాస కేంద్రాల కోసం తుఫాన్ షెల్టర్లు, పాఠశాలల భవనాలను రెవెన్యూ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే నిత్యావసర సరుకులను కూడా సిద్ధం చేయాలని తహశీల్దార్లకు ఆదేశాలు అందాయి. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో తహశీల్దార్ బి నారదముని విఆర్‌ఓలతో సమావేశమై తుఫాన్ హెచ్చరికలపై తీసుకోవల్సిన ముందస్తు చర్యలను విఆర్‌ఓలకు వివరించారు. ఇదిలా ఉండగా వార్ధా తుఫాన్ రైతులను కలవరపరుస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో అనేక అటుపోట్లు ఎదుర్కొన్న రైతులను తుఫాన్‌లు కూడా వదలడం లేదు. గత నవంబర్ నెలలో ఏర్పడిన వాయుగండాలు తప్పిపోగా తాజాగా ఏర్పడిన ‘వార్ధా’ తుఫాన్ ఠారెత్తిస్తోంది.
కంట్రోల్ రూం, హెల్ప్‌లైన్ ఏర్పాటు
విజయవాడ: అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుపాను కోస్తాంధ్ర తీరంవైపు కదులుతుండటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నెల 12న నెల్లూరు, కాకినాడల మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 80 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో దీని ప్రభావం కోస్తా తీర ప్రాంత ప్రజలపై ఉండవచ్చు. తుపాను వల్ల ఎటువంటి విపత్తు, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ ఎం.వి.శేషగిరి బాబు అప్రమత్తం చేశారు. ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవసరమైతే ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలని సూచించింది. తుపాను పరిస్థితిని పరిశీలించి, సహాయక చర్యలకు అందుబాటులో ఉండేందుకు విజయవాడలోని కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్‌లో కంట్రోల్ రూం, హెల్ప్‌లైన్ నెంబరు 0866-2488000 ఏర్పాటు చేశామని తెలిపారు.

చిత్రం..మంగినపూడి బీచ్‌లో ఎగిసిపడుతున్న అలలు