ఆంధ్రప్రదేశ్‌

రైల్వే పనుల్లో అక్రమాలకు చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 1: రైల్వేలో వివిధ పనులకు టెండర్లు పిలవగానే కాంట్రాక్టర్లు కుమ్మక్కవ్వడం, ముందే నిర్ణయించుకుని అధిక శాతాలకు టెండర్లు దాఖలు చేయడం, తమవారు కాకుండా వేరేవారు వస్తే బెదిరించి వెనక్కి పంపడం వంటి సంఘటనలతో ఆ శాఖ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఇకపై ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. ఇన్నాళ్లు మ్యాన్యువల్‌గా జరిగిన టెండర్లను ఇకపై ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. త్వరలోనే ఆన్‌లైన్ టెండర్ల నిర్వహణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కాగా టెండర్లను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోవడంతో సిబ్బందిని అధికారులు ఇందుకు సిద్ధంచేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాందేడ్, సికింద్రాబాద్, హైదరాబాద్, గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్ల పరిధిలోని సిబ్బందికి ఆన్‌లైన్ టెండర్ల నిర్వహణపై ఢిల్లీలో శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం సికింద్రాబాద్‌లో ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, సెక్షన్ ఇంజనీర్లు ఈ విధానంలో శిక్షణ పొందుతున్నారు. రైల్వే బోర్డు నిర్ణయం మేరకు ఈ నెల నుండే టెండర్లను ఆన్‌లైన్ ద్వారా పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా కంప్యూటర్లలో ప్రోగ్రామింగ్ పనులు కూడా సాగుతున్నాయి. టెండర్ల నిర్వహణతో సంబంధం ఉండే సిబ్బంది, అధికారుల డిజిటల్ సంతకాలను సేకరిస్తున్నారు. కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు తదితరులు టెండర్ల సమయంలో టెండర్ బాక్సు కార్యాలయానికి వచ్చి ఇతర కాంట్రాక్టర్లపై దాడులు చేయడం, టెండర్లు వేయకుండా అడ్డుకోవడం వంటి సంఘటనలు జరగకుండా ఈ ఆన్‌లైన్ విధానాన్ని రూపొందించారు. ఈ విధానంలో ఎటువంటి మోసాలు జరగకుండానే ముందస్తుగానే బినామీ సంతకాలు చేయడానికి వీల్లేకుండా కాంట్రాక్టర్ల డిజిటల్ సంతకాల ఆధారంగా టెండర్లు నిర్వహణకు అన్ని చర్యలు రైల్వే శాఖ తీసుకుంటోంది. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టర్లు స్వయంగా వచ్చి టెండర్లు బాక్సులో వేసే ప్రక్రియకు ఇక తెరపడనుండటంతో ఆయా డివిజన్లోని డిఆర్‌ఎం కార్యాలయ ఆవరణల్లోని టెండర్ల బాక్సు కార్యాలయాలు కూడా కనుమరుగుకానున్నాయి. అలాగే వివిధ కార్యాలయాల్లో కూడా టెండర్ల బాక్సులు ఇక ముందు కనిపించవు. కాంట్రాక్టర్లు వ్యక్తిగతంగా కార్యాలయానికి రాకుండానే ఆన్‌లైన్ ద్వారా తమ టెండర్లు దాఖలుచేయాల్సివుంటుంది. దీనివల్ల కాంట్రాక్టర్లు రింగవ్వడం సాధ్యపడదు కనుక రైల్వేకు ఏటా వందల కోట్ల రూపాయలు మిగులుతాయని భావిస్తున్నారు.