ఆంధ్రప్రదేశ్‌

రూ.100 కోట్లతో దుర్గగుడి అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) ఏప్రిల్ 1: దుర్గగుడిని మరింత అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.100కోట్ల ఖర్చుతో మాస్టర్ ప్లాన్ రూపొందించి ఈ మేరకు పనులను ప్రారంభించేందుకు దుర్గగుడి ఇన్‌చార్జ్ ఇవో చంద్రశేఖర్ ఆజాద్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పనుల వివరాలను అజాద్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి స్వయంగా వివరించి ఆయన వద్దనుండి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఫారెస్ట్ జోన్ కింద ఉన్న ఇంద్రకీలాద్రి కొండ మొత్తాన్ని దుర్గగుడి పరిధిలోనికి తీసుకొచ్చి 120 మీటర్ల పరిధిలో హద్దుగా అతి పెద్ద వాల్‌ను నిర్మించి తర్వాత శ్రీవారి సన్నిధి తరహాలో మాడవీధులను నిర్మించటంతోపాటు అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఉత్సవమూర్తులను ఊరేగించడానికి అమ్మవారి భవానీదీక్షల విరమణ సమయంలో భవానీలు గిరిప్రదక్షణ సైతం చేసే విధంగా ఈ మాఢవీధులను నిర్మించే విధంగా అజాద్ ప్రణాళిక సిద్ధం చేశారు. దీనివలన గతంలో మాదిరిగా కాకుండా కొండకింద ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం ఉండదు. ఇదేవిధంగా ఇంద్రకీలాద్రి పైభాగంలో అర్జునుడు తపస్సు చేసిన పాశుపతాస్త్రం ఆలయానికి మెట్ల మార్గం, రోప్‌వే నిర్మించనున్నారు. అమ్మవారి సన్నిధిలో ఎటువంటి పరిపాలన విభాగాలు లేకుండా అన్నింటిని కిందకు మార్చటానికి ఇప్పటికే ఆజాద్ ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం ఇవో పేషీ కార్యాలయం స్థానంలో ఒక కోనేరు, పాత అన్నదాన భవనం వద్ద జలశయం ఏర్పాటు చేసే విధంగా ఈ మాస్టర్ ప్లాన్‌లో వాస్తు, ఆగమ, శాస్త్రాలకు అనుగుణంగా పొందుపర్చారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడు విధిగా శ్రీ మల్లేశ్వరస్వామివారిని దర్శించుకునే విధంగా రెండు ప్రత్యేక క్యూమార్గాలను ఏర్పాటు చేయడానికి ప్లాన్‌లో పొందుపరిచారు. దుర్గగుడి స్థల పురాణం, విశిష్టత అందరికీ తెలిపే విధంగా గతంలో ఉన్న ఇంద్రకీలాద్రి శాసనాలు పుస్తకాన్ని రూపొందించటంతోపాటు, ఈ నెల 18న దుర్గగుడి నుండి ఒక అర్చక బృందం అమెరికా వెళ్లి అక్కడ ఉన్న ప్రవాస భారతీయులతో ప్రతి శనివారం, ఆదివారం, రోజుల్లో వివిధ రకాలైన ప్రత్యేక పూజలను చేయించనున్నారు.