ఆంధ్రప్రదేశ్‌

నియోజకవర్గాల విభజనకై ఆరాటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 1: రెండేళ్ల క్రితం వరకు విభజన అంటేనే నేతాశ్రీలు చిర్రెత్తుకొచ్చినట్లు విరుచుకుపడేవారు. కానీ ఆ కాలం మారిపోయింది. ఇప్పుడు విభజన కోసం అర్రులు చాస్తున్నవారి సంఖ్యే అధికంగా కన్పిస్తోంది. ఇంతకీ ఆ విభజనకు, ఈ విభజనకి తేడా ఉంది. అప్పట్లో రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన నాయకులంతా ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన కోసం ఆరాటపడుతున్నారు. దీనిపై ఇటీవలి కాలంలో కేంద్ర స్థాయిలో కదలిక కన్పిస్తుండటంతో నేతల్లో ఆశల ఊసులు మాత్రం భారీగా పెరిగిపోయాయి. సామాజిక సమీకరణాల నేపథ్యంలో టిక్కెట్లు దక్కించుకోలేకపోయిన పలువురు నేతలు ఈ నియోజకవర్గాల పెంపుపైనే ఆశలు పెట్టుకున్నారు. కొత్త అవకాశాలు అంది వస్తాయన్న నమ్మకం పార్టీల నేతలను ఉత్సాహపరుస్తోంది. రాష్టవ్య్రాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తుండగా కొన్ని జిల్లాల్లో మాత్రం నేతలకు సీట్లు సర్దుబాటు కోసం అధికార పక్షం నానాతంటాళ్లు పడుతుండటంతో ఈ విభజన కార్యక్రమం కూడా ముందుకు సాగుతున్నట్లు కన్పిస్తోంది. రాజకీయంగా చైతన్యం కలిగిన పశ్చిమగోదావరి జిల్లా పరిస్థితిని చూస్తే ప్రస్తుతం జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండగా అన్నింటిలోనూ టిడిపి పాగా వేసింది. వైకాపా బోణి కొట్టలేక చతికిలపడింది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు జిల్లాలో 16 నియోజకవర్గాలుండేవి. పునర్విభజన పుణ్యమా అని అవి 15కు తగ్గిపోయాయి. ఇక నియోజకవర్గాల పునర్విభజన కోణం నుంచి జిల్లాను చూస్తే ప్రస్తుతం ఉన్న 15 నియోజకవర్గాలను 18 నియోజకవర్గాలుగా మార్చే అవకాశమున్నట్టు సమాచారం. అయితే ఇది ఎంతవరకు ఆచరణసాధ్యం, ఈ సంఖ్య మరింత పెరుగుతుందా, తగ్గుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది. అయితే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు కోసం ఇంతకుముందు ప్రయత్నించినవారు, ఇప్పుడు ఆ కోవలోకి చేరాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నవారు కూడా తమ నియోజకవర్గం విభజన జరిగితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఏరకంగా చూసినా జిల్లా మొత్తంలోనే అధికార పార్టీ పూర్తిస్థాయిలో పాగా వేసిన నేపథ్యంలో ఈ విభజనపై ప్రధానంగా అధికార పార్టీలో నాయకుల కోలాహలం విశేషంగా కన్పిస్తోంది. అయితే ఓటింగ్ శాతం చెప్పుకోదగ్గ స్థాయిలో వచ్చినా వైసిపిలో మాత్రం ఈ ఉత్సాహం, హడావిడి కన్పించకపోయినా, కాస్త ఉత్కంఠ నెలకొంది. ఒకరకంగా చూస్తే జిల్లాలో మొత్తం మూడు నియోకవర్గాలు పెరిగితే ఈ మూడు ఎక్కడన్నదే చర్చనీయాంశంగా మారింది. ముందునుంచి అనుకుంటున్నట్లు జిల్లా కేంద్రమైన ఏలూరు నియోజకవర్గాన్ని రెండుగా చేస్తారన్న ప్రచారం జరుగుతూనే ఉంది. దానికి తగ్గట్టుగానే ఏలూరు అర్బన్, ఏలూరు రూరల్ అన్న రీతిలో కొంతమంది నాయకులు గత కొద్దికాలంగా వ్యవహారాలను నడుపుతుండటం కూడా గమనార్హం. జిల్లా కేంద్రం కావటం, ఏలూరు మండలం భారీగా విస్తరించి ఉండటంతో ఈ నియోజకవర్గాన్ని రెండుగా చేస్తారని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఏలూరు రూరల్, పెదపాడు మండలాలను కలిపి ఒక నియోజకవర్గం చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే సామాజికవర్గ సమీకరణాల్లో ఇది ఎంతవరకు ఆమోదయోగ్యం అవుతుందన్నది పరిశీలించాల్సి ఉంది. అదేవిధంగా ఏజన్సీ ముఖద్వారంగా చెప్పుకునే జంగారెడ్డిగూడెంను ఎప్పటినుంచో ప్రత్యేక నియోజకవర్గంగా గుర్తించాలన్న డిమాండ్ ఉంది. దానికి ఇప్పుడు మోక్షం లభిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు డెల్టా పరిధిలోని మరో నియోజకవర్గంలోనూ ఈ విభజన ఉండవచ్చునని చెపుతున్నారు.