ఆంధ్రప్రదేశ్‌

ఉపమాక దేవస్థానం ఉద్యోగుల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 1: టిటిడి పరిధిలోని విశాఖ జిల్లా ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గల సత్రంలో అసాంఘిక కార్యక్రమాలను పాల్పడ్డ ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ టిటిడి ఇఒ డాక్టర్ డి.సాంబశివరావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉపమాక ఆలయం వద్ద ఒక మహిళతో అసభ్య కార్యక్రమాలకు పాల్పడిన విషయం మీడియాలో విస్తృతంగా ప్రచారమైన నేపధ్యంలో ఇఒ తీవ్రంగా స్పందించారు. ఈక్రమంలో ఉపమాకలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.వి.రమణ మూర్తి, శృతి విద్వాన్‌గా పనిచేస్తున్న నర్సీపురం సురేష్, అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మునికుమార్ బుధవారం రాత్రి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లు టిటిడి అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు క్రమశిక్షణ చర్యగా ఉద్యోగులను ఇ ఒ సస్పెండ్ చేశారు. ఈఘటనపై పూర్తి విచారణ జరిపించాలని అదనపు ముఖ్య నిఘా,్భద్రతాధికారి శివకుమార్‌రెడ్డి, ప్రత్యేక శ్రేణి డిప్యూటి ఇ ఒ చెంచులక్ష్మిని ఇ ఒ ఆదేశించారు.

కెకె.లైన్‌లో
రైళ్ల రాకపోకలకు అంతరాయం
అనంతగిరి, ఏప్రిల్ 1: విశాఖ జిల్లా కెకె.లైన్‌లో శుక్రవారం విద్యుత్ తీగలు తెగిపడడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొత్తవలస, కిరండోలు మార్గంలో బొర్రా, తైడా రైల్వేస్టేషన్ల మధ్య శుక్రవారం ఉదయం విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. కిరండోలు ప్యాసింజర్ రైలు తైడా చేరుకున్న సమయంలో చోటుచేసుకుంది. దీంతో రైలును తైడా సమీపంలో నిలిపివేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్యాసింజర్ రైలు నిలిచిపోయంది. దూరప్రాంతాల నుంచి పిల్లలతో వచ్చిన ప్రయాణికులు ఆహారం దొరక్క రైల్వేస్టేషన్‌లో అవస్థలు పడాల్సివచ్చింది. కాలినడకన ప్రధాన రహదారిపైకి చేరుకుని ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి బొర్రా చేరుకున్నారు. మూడు గంటల తరువాత మరమ్మతులు చేపట్టడంతో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.

ఎపి ప్రైవేట్ వైద్య, దంత వైద్య కళాశాలల్లో
బి కేటగిరి ప్రవేశాలకు నోటిఫికేషన్
విజయవాడ, ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ వైద్య మరియు దంత వైద్య కళాశాలల్లో బి కేటగిరీ ప్రవేశాలకై ఎంసెట్ ఎపి కన్వీనర్ డాక్టర్ కెజె రమేష్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఎపి మెడికో డాట్ కాం వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు తీసుకొని ఈ నెల 4 నుంచి మే 1 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. మే 9 నుంచి 13 వరకు హాల్ టిక్కెట్లను ఆన్‌లైన్లో పొందవచ్చని ఆంధ్రా తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 36 పరీక్ష కేంద్రాలలో మే 13న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. ఈ పరీక్షలో 160 ప్రశ్నలు ఉంటాయని, ఈ ప్రవేశ పరీక్ష ఇంగ్లీషు, తెలుగు భాషలలో ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజుల కింద 2 వేల రూపాయలను డెబిట్, క్రెడిట్ కార్డుల, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాల్సి ఉంది. 13 ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సుమారు 600 ఎమ్‌బిబిఎస్ సీట్లు, ప్రైవేట్ దంత వైద్య కళాశాలల్లో 400 బిడిఎస్ సీట్లు ప్రవేశానికి ఈ బి కేటగిరి పరీక్ష నిర్వహిస్తారు.

సాగర జలాల్లోకి
ఆలివ్‌రిడ్లే తాబేళ్ల పిల్లలు
అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు విశాఖ జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ప్రతి యేటా నవంబర్ నుంచి రెండు నెలల పాటు ఆలివ్ రిడ్లే తాబేళ్లు విశాఖతీరంలో గుడ్లు పెడతాయి. వీటిని సేకరించి సంరక్షిస్తుంటారు. మూడు నెలల తరువాత గుడ్ల నుంచి పిల్లలు బయటకురాగానే సముద్రంలోకి విడిచిపెడుతుంటారు. శుక్రవారం జిల్లా యంత్రాంగం, ఔత్సాహిక జంతుప్రేమికులు సాగరతీరంలో తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు.

అన్ని జిలాల్లో ఎన్టీఆర్ ట్రస్టు భవనాలు
శ్రీకాకుళం, ఏప్రిల్ 1: ఉగాది పర్వదినాన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం గుంటూరులో ఏర్పాటుచేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు చెప్పారు. ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ ట్రస్టు భవనాల నిర్మాణానికి కేంద్ర పార్టీ కార్యదర్శి నారా లోకేష్ రూపకల్పన చేసారన్నారు. కార్యకర్తలు, వారి కుటుంబసభ్యులు, పిల్లలకు విద్యాబోధన నేర్పించే విజ్ఞాన కేంద్రాలుగా, వైద్యసేవలు అందించే అత్యవసర ఆధునాతన హైటెక్ ఆసుపత్రులుగా జిల్లా ఎన్టీఆర్ ట్రస్టు భవనాలు నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించినట్లు వివరించారు. శుక్రవారం శ్రీకాకుళంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల ఎనిమిదో తేదీలోగా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి గుంటూరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలిస్తామన్నారు. అమరావతిలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి సుమారు 4.5 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే ఆ స్థలం ప్రస్తుతం పార్టీ చేతికి ఇంకా రాలేదని, ప్రభుత్వ నిబంధనలు పూర్తి అయి పార్టీకి అందజేసిన వెంటనే కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టి దసరా నాటికి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. విజయవాడలో పార్టీ క్యాంపు కార్యాలయాన్ని ఆరు నెలల్లో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్టవ్య్రాప్తంగా పార్టీ కార్యాలయాలు లేని జిల్లాల్లో కొత్తగా నిర్మిస్తామన్నారు. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో ఎన్టీఆర్ ట్రస్టు భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు.

భారీ వర్షంతో తడిసి ముద్దయిన అరకు
అరకులోయ, ఏప్రిల్ 1: భారీ వర్షంతో అరకు తడిసి ముద్దయింది. వాతావరణంలో అనూహ్యంగా చోటుచేసుకున్న మార్పులతో గురువారం అర్థరాత్రి అరకులో భారీ వర్షం కురిసింది. చిన్నపాటి చినుకులతో మొదలైన వాన కుండపోతగా కురవడంతో అరకులోయ తడిసి ముద్దయింది. వానకు తోడు భారీగా ఈదురుగాలులు వీయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

భూమాతో కలిసి పనిచేస్తాం: శిల్పా
కర్నూలు సిటీ, ఏప్రిల్ 1: పార్టీలో ఎవ్వరితోనూ విభేదాలు లేవని, కొత్తగా చేరిన భూమా నాగిరెడ్డితో కలిసి పని చేసి పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామని కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. పార్టీలోకి కొత్తగా చేరిన వారికి పాత వారితో కలవటం ఇబ్బందిగానే ఉంటుందన్నారు. అంతేకాకుండా వారు పార్టీలో చేరినప్పటికీ తమ ప్రాబల్యాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తారని వెల్లడించారు. వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డిని టిడిపిలో చేర్చుకునే సమయంలోనే శిల్పా సోదరులతో సిఎం చంద్రబాబు మాట్లాడి భూమాతో కలిసి పని చేయాలని ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోందన్నారు. అయితే అలాంటిది ఏమీ లేదని, పార్టీలో అందరూ సమానమేనని చెబుతూ, అనుకోకుండా ఒక సంఘటన జరిగిందని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధినేత ఆదేశించారని శిల్పా వివరించారు.

‘పది’ ప్రశ్నపత్రంలో పాటించని బ్లూ ప్రింట్!
కర్నూలు అర్బన్, ఏప్రిల్ 1: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా జనరల్ సైన్స్ పేపర్-2 ప్రశ్నపత్రంలో రాష్ట్ర విద్యాశాఖ తయారు చేసిన బ్లూ ప్రింట్ ఆధారంగా ప్రశ్నలను రూపొందించకుండా ఒకే విభాగం నుంచి రెండు ప్రశ్నలు ఇవ్వడం పట్ల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం జరిగిన జనరల్ సైన్స్ పరీక్షలోని సెన్-4లో 5 మార్కులకు సంబంధించి 2 ప్రశ్నలకుగాను ఒక ప్రశ్నకు సంబంధించి చిత్రం గీయాల్సి ఉంటుంది. ఇందులో బ్లూ ప్రింట్ ఆధారంగా ఒక ప్రశ్న వృక్ష శాస్త్రం, రెండోది జంతు శాస్త్రం నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ విద్యాశాఖ 23వ ప్రశ్నలో హ్యుమన్ ఎక్స్‌క్రీటరీ సిస్టమ్, 24వ ప్రశ్నలో హ్యుమన్ స్పర్మ్ చిత్రాలను గీయాలని ఇచ్చారు. ఈ రెండు ప్రశ్నలు జంతు శాస్త్రానికి సంబంధించినవి కావడంతో విద్యార్థులు కాస్త ఇబ్బందికి గురయ్యారు. వాస్తవంగా తాము బ్లూ ప్రింట్ ఆధారంగా చదువుకున్నామని ఇలా ప్రశ్నలను బ్లూ ప్రింట్ పాటించకుండా ఇవ్వడం ఇబ్బందికరంగా ఉందన్నారు.

చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం
ఒంగోలు అర్బన్, ఏప్రిల్ 1: ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన సహస్ర అనే ఆరేళ్ల బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 12గంటల్లోపే చిన్నారిని కిడ్నాపర్ చెర నుంచి విడిపించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈవిషయాన్ని జిల్లా అదనపు ఎస్‌పి బి రామానాయక్ శుక్రవారం ఒంగోలులో విలేఖరులకు వివరించారు. గురువారం మధ్యాహ్నం 12గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముఖాలకు మాస్క్‌లు, హెల్మెట్లు ధరించి కనిగిరి పట్టణంలోని దుత్తలూరి వారివీధిలో తన ఇంటి వద్ద ఆడుకుంటున్న ఐదేళ్ల దేవిరెడ్డి సహస్రను బలవంతంగా మోటారుబైక్‌పై ఎక్కించుకుని పారిపోయారు. విషయాన్ని తెలుసుకున్న చిన్నారి తండ్రి శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి టెలిఫోన్ కాల్ ఆధారంగా కేసు ఛేదించారు. డబ్బుకోసం చిన్నారిని కిడ్నాప్ చేసింది ఆమె బాబాయేనని తేల్చారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడు విజయవాడలో ఒక అపార్టుమెంట్‌లో బాలికను బంధించడాన్ని గుర్తించారు. వెంటనే ఆమెను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. కాగా కిడ్నాప్ చేసిన చిన్నారి బాబాయి రాజేష్‌రెడ్డి, అతనికి సహకరించిన నెల్లూరు జిల్లాకు చెందిన సాల్మన్, కృష్ణాజిల్లాకు చెందిన బషీర్‌ను అరెస్టుచేశామన్నారు.