ఆంధ్రప్రదేశ్‌

కరపాడు, తడ వద్ద ఏకీకృత చెక్‌పోస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 1: రాష్ట్రంలో కొత్తగా రెండు ఏకీకృత చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఏకీకృత చెక్‌పోస్టుకు రూ. 94.50 కోట్లు ఖర్చవుతుంది. నెల్లూరు జిల్లా తడ వద్ద బివి పాలెం, శ్రీకాకుళం జిల్లా కరపాడు గ్రామం వద్ద పురుషోత్తమపురంలో ఏకీకృత చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తారు.
ఈ రెండు పోస్టులకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు ఏకీకృత చెక్ పోస్టులు ఉన్నాయి. ఇవి చిత్తూరు జిల్లా నరహరిపేట, నెల్లూరు జిల్లా భీమునివారిపాలెం, శ్రీకాకుళం జిల్లా పురుషోత్తపురంలో సమర్ధంగా పనిచేస్తున్నాయి. చెక్‌పోస్టులను ఆధునీకరించడం వల్ల ఆదాయం పెరిగింది. 2014-15లో రూ. 6.79 కోట్ల ఆదాయం రాగా, 2015-16లో మూడు రెట్లు పెరిగి రూ. 36.20 కోట్లకు చేరుకుంది. వాహనాల రద్దీ కూడా గణనీయంగా పెరిగింది. 7.76 లక్షల నుంచి 18.72 లక్షలకు వాహనాల రాకపోకలు పెరిగాయి. ప్రస్తుతం కోడికొండ, తుమ్ముకుంట, గుంతకల్, పంచలింగాల, పలమనేరు, నాగలపురం, తడుకుపేట, తానా, జోడి చింతల, మాచర్ల, పిడుగురాళ్ల, గరికపాడు, తిరువూరు, జీలుగుమిల్లి, చింతలపూడి, సుంకరపాలెం, చట్టి, రామభద్రాపురంలో 18 సరిహద్దు చెక్‌పోస్టులు ఉన్నాయి. కొన్ని సరుకు వాహనాలు బైపాస్ రోడ్లను ఎంపిక చేసుకుని చెక్‌పోస్టులను తప్పిస్తున్నందున నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. బిపి పాలెం చెక్‌పోస్టు వద్ద రూ.22 కోట్లతో ట్రక్‌స్కానర్లు ఏర్పాటు చేశారు. వ్యాట్ పన్నులను వసూళ్లు చేసేందుకు ఐటి విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇ-రిటర్న్, ఇ-చెల్లింపులు, ఇ-వే బిల్లులు, ఇ-ట్రాన్సిట్ పాస్ విధానాలను అమలు చేస్తున్నారు. సరుకులను రవాణా చేసే వాహనాలకు సింగిల్ విండో తనిఖీ సదుపాయాన్ని కల్పించారు.