ఆంధ్రప్రదేశ్‌

డిజిటలైజేషన్ గడువు పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 15: రాష్ట్రంలో కేబుల్ టివి సేవలకు సంబంధించిన మూడు, నాలుగో దశ డిజిటలైజేషన్ ప్రక్రియ గడువును వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును కోరారు. ఈమేరకు గురువారం వెంకయ్య నాయుడుకు ఆయన లేఖ రాశారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును రాష్ట్రంలో పెద్దఎత్తున అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని కోరారు. వినియోగదారులందరినీ ఎపి ఫైబర్ గ్రిడ్ పరిధిలోకి తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమం జరుగుతోందని, రాష్టవ్య్రాప్తంగా ఇప్పటికే 13,325 మంది ఎల్‌సివోలు, ఎంఎస్‌వోలు మరో 13,325 మంది, ఎపి ఫైబర్ గ్రిడ్‌తో వ్యాపార భాగస్వాములుగా నమోదయ్యారని తెలిపారు. నూతన సాంకేతిక పరిధికి లోబడి వినియోగదారులందరికీ కేబుల్ డిజిటల్ బాక్సులు అందించాలంటే మరింత కాలం పడుతుందన్నారు. అందువల్ల కేబుల్ టివి సేవల డిజిటలైజేషన్‌కు మరో ఏడాది గడువు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలో విజ్ఞప్తి చేశారు.