ఆంధ్రప్రదేశ్‌

విజయవాడ పోలీస్ కమిషనరేట్, సిటీ సెక్యూరిటీ వింగ్ బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో పోలీసు శాఖను పటిష్ఠం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌పై విఐపిలు, వివిఐపిల భద్రత ఏర్పాట్ల భారం రోజు రోజుకీ పెరగడంతో పాటు నిఘాపరంగా పోలీసు విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా విజయవాడ పోలీసు కమిషనరేట్‌కు 471 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో జోన్లను పునర్వ్యవస్థీకరించేందుకు వీలుకలుగుతుంది. ఒక అదనపుసిపి, ఒక జాయింట్ సిపి, ఇద్దరు డిసిలను కేడర్ పోస్టులుగా ప్రభుత్వం కమిషనరేట్‌కు మంజూరు చేసింది. వీరితో పాటు 9 ఎసిపి, 15 ఇన్‌స్పెక్టర్, 27 ఎస్‌ఐ, 12 ఎస్‌ఐ, 91 హెచ్‌సి, 288 కానిస్టేబుల్, 3 సీనియర్ అసిస్టెంట్, 9 జూనియర్ అసిస్టెంట్, 1 జూనియర్ స్టెనో, 3 డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్లు, 6 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను మంజూరు చేసింది. అలాగే విజయవాడ సిటీ సెక్యూరిటీ వింగ్‌ను బలోపేతం చేసేందుకు గాను 1 డిసిపి, 1 అదనపు డిసిపి, 2 ఎసిపిలు, 4 ఆర్‌ఐ, 41 ఆర్‌ఎస్‌ఐ, 11 ఎఆర్‌ఎస్‌ఐ, 40 ఎఆర్ హెడ్, 345 అసిస్టెంట్ రిజర్వు పోలీసు కానిస్టేబుల్స్, 79 కానిస్టేబుల్ డ్రైవర్లు, 30 మహిళా కానిస్టేబుళ్లు, ఇతర ఉద్యోగులను అనుమతిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది.
కాగా కొత్తగా ఏర్పాటైన తుళ్లూరు పోలీసు సబ్ డివిజన్‌కు 674 పోస్టులను మంజూరు చేస్తూ వేరుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1 డిఎస్పీ, 8 సిఐ, 28 ఎస్‌ఐ, 49 ఎఎస్‌ఐ, 101 హెడ్ కానిస్టేబుళ్లు, 480 కానిస్టేబుల్స్, 1 సీనియర్ అసిస్టెంట్, 2 జూనియర్ అసిస్టెంట్లు, 1 టైపిస్టు, 3 క్లాస్ ఫోర్ పోస్టులను భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

వరికి మద్దతు ధర
చెల్లింపులో రాజీ వద్దు
మరిన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: చంద్రబాబు
హైదరాబాద్, ఏప్రిల్ 1: ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లించే అంశంలో ఎంత మాత్రం రాజీ పడవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులను ఆదేశించారు. వరికి కనీస మద్దతు ధర కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు టెలీకాన్ఫరెన్స్‌లో అక్కడి పరిస్థితిని వివరించారు. ఈ నెల ఐదో తేదీ నుండి నెల్లూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో 164, తూర్పుగోదావరిలో 284, పశ్చిమగోదావరిలో 260 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సిఎం కోరారు. రబీ సీజన్‌లో 30 నుండి 35 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడికి రావచ్చని అంచనా. నెల్లూరులో ఇప్పటికే 83 కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని సిఎం గుర్తుచేశారు. మిల్లర్లు తక్కువ రేటుకు కొంటే రైతాంగం నష్టపోకుండా అవసరమైతే అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో తలెత్తే సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్లు నెలకొల్పాలని, జాప్యం లేకుండా రైతులకు చెల్లింపులు పూర్తి చేయాలని సిఎం కోరారు.

నేడు కేబినెట్ భేటీ
ఉద్యోగుల తరలింపే ప్రధాన అజెండా
విజయవాడ, ఏప్రిల్ 1: రాష్ట్ర కేబినెట్ సమావేశం శనివారం విజయవాడలో జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో విజయవాడకు సుమారు 12 వేల మంది ఉద్యోగులను తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారికి కావల్సిన వౌలిక సదుపాయాల ఏర్పాటు తదితర అంశాలపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు. అలాగే పట్టిసీమ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం, అదే జోష్‌తో పోలవరం ప్రాజెక్ట్‌ను కూడా పూర్తి చేయాలని భావిస్తోంది. దీనిపై కూడా క్యాబినెట్‌లో చర్చించనున్నారు. అలాగే ఇసుక విధానం గురించి చర్చించనున్నారు. అలాగే, కృష్ణా పుష్కరాలపై కూడా క్యాబినెట్‌లో చర్చించనున్నారు.
నేడు పాలిట్‌బ్యూరో సమావేశం
ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ పాలిట్‌బ్యూరో సమావేశం శనివారం జరగనుంది. ఆపరేషన్ ఆకర్ష్‌పై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. త్వరలో నిర్వహించనున్న మహానాడుపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.

‘విట్’కు దరఖాస్తుల వెల్లువ
హైదరాబాద్, ఏప్రిల్ 1: ప్రతిష్ఠాత్మక వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు నిర్వహించే ‘విటీ-2016’ ప్రవేశపరీక్షకు ఈ ఏడాది 2,12,238 మంది దరఖాస్తు చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 10వేల దరఖాస్తులు అదనంగా వచ్చినట్టు విటీ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాధన్ తెలిపారు. గత ఏడాది 2,02,406 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా యుపి నుండి 32,947 దరఖాస్తులు వచ్చాయని, ఆంధ్ర నుండి 27,427 దరఖాస్తులు వచ్చాయని, తెలంగాణ నుండి 14,476 వచ్చాయని వివరించారు. వెబ్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష ఏప్రిల్ 6 నుండి 17వ తేదీ వరకూ 118 నగరాల్లో జరుగుతుందని చెప్పారు. ఫలితాలను ఏప్రిల్ 29న వెల్లడిస్తామని పేర్కొన్నారు.