ఆంధ్రప్రదేశ్‌

సచివాలయానికి 12 వేల మంది ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 1: రాజధాని అమరావతిలోనిర్మాణమవుతున్న సచివాలయం గడువుకన్నా ముందే పూర్తవుతుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. సచివాలయం లో పని చేయడం కోసం హైదరామాద్‌నుంచి 12 వేల మంది తరలిరానున్నారని చెప్పారు. వేసవి కాలంలో మంచినీటి ఎద్దడిని అధిగమించేందుకు నిధుల కొరత లేదని నారాయణ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కోటి రూపాయల అంచనాతో నిర్మించతలపెట్టిన మున్సిపల్ కార్యాలయ నూతన భవనానికి శుక్రవారం శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో నివాసం ఉండే ప్రతి వ్యక్తికి 135 లీటర్ల మంచినీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రం లో 5.50 లక్షల వీధి దీపాలుండగా, ఇప్పటికే 3.50 లక్షల వీధి దీపాలను ఎల్‌ఇడి బల్బులతో మార్చామన్నారు. మిగిలిన 2 లక్షల బల్బులను జూన్ 16 నాటికి అమరుస్తామన్నారు. నూతన భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకునే విషయంలో ఎదురవుతున్న ఆలస్యాన్ని అధిగమించేందుకు క్యాట్ సాఫ్ట్‌వేర్ విధానం ద్వారా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి హాజరైన గుం టూరు ఎంపి గల్లా జయదేవ్ మాట్లాడుతూ త్వరలో కేంద్రం నుంచి 2 నుం చి 3 వేల కోట్ల రూపాయలు రానున్నట్లు తెలిపారు. రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం సంపూర్ణంగా సహకరిస్తోందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోందని ఎంపి తెలిపారు.

సచివాలయానికి మరో రెండంతస్తులు
గుంటూరు, ఏప్రిల్ 1: రాజధాని అమరావతిలో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న తాత్కాలిక సచివాలయాన్ని మరో రెండతస్తులు పెంచాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. శుక్రవారం తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో జరుగుతున్న సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన తరువాత విలేఖరులతో ఆయన మాట్లాడారు. తొలుత 45.12 ఎకరాల్లో 6 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో సచివాలయ భవనాన్ని రెండతస్తులకు పరిమితం చేస్తూ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా నిర్మాణాలను ఎల్‌అండ్‌టి, షాపూర్జీ పల్లొంజీ కంపెనీలు పనులు ప్రారంభించాయి. జూన్ 15 నాటికి నిర్మాణాలు పూర్తి చేసి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించటంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ భవనానికి మరో 2 అంతస్తులు అదనంగా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఆ మేరకు త్వరలో టెండర్లు పిలువనున్నట్లు తెలియజేశారు. జూలై నెలలో 3, ఆగస్టు నాటికి 4వ అంతస్తును పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.

రూ. 10కోట్లతో ఎండోమెంట్స్ కమిషనర్ ఆఫీసు
భూమి పూజ చేసిన ఆర్‌జెసి చంద్రశేఖర్ ఆజాద్

విజయవాడ (ఇంద్రకీలాద్రి) ఏప్రిల్ 1: రూ.10కోట్ల ఖర్చుతో గొల్లపూడిలో దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ నూతన కార్యాలయం నిర్మాణానికి దేవాదాయ ధర్మాదాయశాఖ మల్టీజోన్ రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ అజాద్ భూమి పూజ చేశారు. వేణుగోపాలస్వామివారి దేవస్థానానికి చెందిన 6 ఎకరాల 6 సెంట్ల స్థలంలో కమిషనర్ కార్యాలయాన్ని నిర్మించేందుకు అవసరమైన అనుమతులు పొందారు. ఈ నూతన భవనంలో దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ కార్యాలయం, మంత్రి సమావేశ మందిరం, వేణుగోపాలస్వామి ఆలయం, కోనేరు, అదనపుకమిషనర్ల కార్యాలయం, ఆలయ అర్చకస్వామి వసతిగృహం, ప్రసాదాల నివేదనశాలతోపాటు కమిషనర్ కార్యాలయానికి చెందిన అన్ని సెక్షన్ ఉద్యోగుల కార్యాలయాలు ఏర్పాటవుతాయి. సుమారు 3నెలల వ్యవధిలో కమిషనర్ కార్యాలయం పూర్తి చేసే విధంగా పనులు ప్రారంభించినట్టు అధికారులు చెప్పారు. ఈ స్థలం వేణుగోపాలస్వామివారి దేవస్థానానికి చెందిన కావటంతో నెలకు రూ.50వేలు చొప్పున కమిషనర్ కార్యాలయం అద్దెగా చెల్లిస్తుంది. 30 ఏళ్లపాటు ఈ స్థలాన్ని కమిషనరేట్ అద్దెకు తీసుకుని, ఈ నిర్మాణాన్ని చేపడుతోంది. కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యస్ శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్ జివిఆర్ శంకర్, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ దుర్గాప్రసాద్, వేణుగోపాల స్వామి దేవస్థానం ఇవో స్నపనదేవి తదితరులు పాల్గొన్నారు.