ఆంధ్రప్రదేశ్‌

విపక్షాలన్నీ ఏకమై పార్లమెంట్ సమావేశాలు వృధా చేసాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 18: అవినీతిపరులకు అండగా ఉండేందుకు విపక్షాలు ఉమ్మడిగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలను అడ్డుకుని ప్రజలను మోసం చేశాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి కంభంపాటి హరిబాబు విమర్శించారు. చంద్రబాబును నగదురహిత అమలు కమిటీలో సభ్యునిగా నియమించి ప్రధాని మోదీ ఆయన ముఖాన బురద వేసారన్న ఎంపి రాయపాటి విమర్శకు స్పందిస్తూ ఒకవేళ ఆయన అలా భావిస్తే తామే కడుగుతామన్నారు. పవన్‌కళ్యాణ్‌తో నేటికీ తమకు విబేధాలు లేవన్నారు. భారతీయ జనతా పార్టీ స్వచ్ఛ్భారత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నగరంలోని ఒక ఓహోటల్‌లో ఆదివారం ఉదయం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు విచ్చేసిన కంభంపాటి హరిబాబు ముందుగా విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఏలాంటి బిల్లులు ఆమోదించకుండా ముగియడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. విపక్షాలు సభను జరగనీయకుండా అడ్డుకుని విలువైన కాలాన్ని, ప్రజాధనాన్ని వృధా చేసినట్లు విమర్శించారు. గతంలో యుపిఏ ప్రభుత్వ హయాంలో అవినీతికి, కుంభకోణాలకు వ్యతిరేకంగా సభలో విపక్షాలు ఏకమై పోరాడేవని అన్నారు. కాని నేడు అవినీతిపరులకు అండగా ఉండేందుకు విపక్షాలు ఏకమై సభను అడ్డుకున్నాయని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, అవినీతి, నల్లధనం, నకిలీనోట్ల చెలామణి నిర్మూలన తీవ్రవాద, ఉగ్రవాద చర్యలకు ప్రోత్సాహం లేకుండా చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లను మార్చారన్నారు. దీనిని ప్రజలు హృదయపూర్వకంగా స్వాగతించి తమ మద్దతు తెలిపారన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఇందులో వ్యతిరేకించలేదని, నిర్ణయం అమలులో ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అవి చర్చించి సమస్య పరిష్కారానికి సరైన నిర్ణయం తీసుకుందామని భావిస్తే సభలో చర్చ జరగకుండా విపక్షాలు అడ్డుకున్నాయని విమర్శించారు. పెద్ద నోట్లు మార్పు నిర్ణయం ప్రకటించినప్పుడే 50 రోజులపాటు ఓపిక పట్టాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారని, రూ. 5.50 లక్షల కోట్ల విలువైన నగదు బ్యాంకులకు విడుదల కావడంతో ప్రస్తుతం పరిస్థితి కుదుటపడిందన్నారు. రూ. 500, రూ. 100, రూ. 50, రూ. 20 కొత్త నోట్లు బ్యాంకులకు చేరాయన్నారు. జనవరి ఒకటి నుండి బ్యాంకుల్లో జరిగే లావాదేవీలన్నీ కొత్తనోట్లతోనే జరిగి సాధారణ పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రధాని మోదీ నిర్ణయానికి మద్దతిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కొందరు బ్యాంకు అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా, అక్రమంగా కొందరికి సొమ్మును తరలించారని ఈ రకమైన నేరాలపై దర్యాప్తు జరుగుతోందన్నారు. త్వరలో వారిపై చర్యలు తీసుకుంటారన్నారు. నగదు రహిత లావాదేవీలు చేయడం ద్వారా చిల్లర సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రజలు, వ్యాపారులకు ప్రోత్సాహకాలు ప్రకటించడం పట్ల హరిబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ వ్యాపారం బాగా పెరిగిందని గుర్తు చేశారు. పెద్దనోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ పారదర్శకంగా మారుతుందని, పన్నుల చెల్లింపు పెరిగి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు నిధులు పెరుగుతాయని అన్నారు. ఇఎస్‌ఐ, ఇపిఎఫ్‌ల చెల్లింపులపై వ్యాపారులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరంలేదని, నవంబర్ 8వ తేదీ తర్వాత జరిగే చెల్లింపులపై ఎలాంటి విచారణ ఉండదని ప్రధానిమోదీ హామీ ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు. విలేఖర్ల సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షురాలు కండ్రిగ ఉమ, విశాఖపట్నం మాజీ మేయర్ జనార్ధన్, పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణమూర్తి, పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీనివాసరాజు పాల్గొన్నారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అమలయ్యేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర, జిల్లా కమిటీలు కృషి చేయాలని హరిబాబు సూచించారు. స్వచ్ఛ్భారత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న హరిబాబు మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలన్నీ కలిసి వారిని చైతన్యవంతం చేసి అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం అమలయ్యేలా కృషి చేయాలని పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీలకు సూచించారు. సమావేశంలో పార్టీ ఎంపి గోకరాజు గంగరాజు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న కంభంపాటి హరిబాబు