ఆంధ్రప్రదేశ్‌

గ్రామీణ వైద్యుల శిక్షణకు విధి విధానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: గ్రామీణ వైద్యు ల విధి విధానాల రూపకల్పనకు రాష్ట్రప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని నియమించిందని ఎపి వైద్య, ఆరోగ్యమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ అంశంపై ఎపి సచివాలయంలో మంత్రి చాంబర్‌లో శుక్రవారం నాడు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఎపివివిపి కమిషనర్ సోమరాజు, డిఎంఇ వేణుగోపాల్, ఎమ్మెల్సీ టిడి జనార్ధన్, తెలుగునాడు పారామెడిక్స్ అధ్యక్షుడు సిఎల్ వెంకటరావు తదితరులతో మంత్రి కామినేని కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు వారాల్లో గ్రామీణ వైద్యుల శిక్షణ విధివిధానాలపై నియమించిన కమిటీ తన ప్రాధమిక నివేదికను ఇస్తుందని అన్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా ఆరోగ్య శాఖ డైరెక్టర్ వ్యవహరిస్తారు. వైద్య విధాన పరిషత్ కమిషనర్, డైరెక్టర్ హెల్త్ ఎడ్యుకేషన్, ఎపి మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్, ఎపి పారా మెడికల్ బోర్డు కార్యదర్శి, ఎపి ఎంఐడిసి స్టాండింగ్ కౌన్సిల్, ఆయుష్ అదనపు కమిషనర్, ఇద్దరు న్యాయనిపుణులతో ఈ కమిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆర్‌ఎంపి, పిఎంపి, పారామెడిక్స్ శిక్షణ, పరీక్ష, సర్ట్ఫికేట్ల జారీ అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని మంత్రి తెలిపారు. జాతీయ స్థాయిలో అమలు అవుతున్న విధానాలను, రాష్టస్థ్రాయిలో అమలుచేయాల్సిన విధానాలను కూడా ఈ కమిటీ సమీక్షిస్తుందని చెప్పారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా తీసుకోవల్సిన విధానాలను కూడా కమిటీ అధ్యయనం చేస్తుందని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 52 వేల మంది ఆర్‌ఎంపి, పిఎంపి, పారామెడిక్స్ ఉన్నారని, వీరికి ఏడాది పాటు శిక్షణ ఇస్తారని అన్నారు. థియిరీ, ప్రాక్టికల్స్, ఎన్టీఆర్ సంచార వైద్యంతో పాటు ఇతర అంశాలపై కూడా ఈ ఏడాది శిక్షణ ఉంటుందని చెప్పారు. కాగా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత ప్రతిష్ఠాత్మక క్యాన్సర్ చికిత్సా విభాగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రఖ్యాత సంస్థ నాట్కో 16 కోట్ల రూపాయిల నిధులు వెచ్చించడానికి ప్రతిపాదనలతో ముందుకు వచ్చిందని మంత్రి కామినేని చెప్పారు. దీనికి సంబంధించి ప్రాథమిక చర్చలు ముగిశాయని అన్నారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే కొన్ని వేల మంది క్యాన్సర్ బాధితులకు మెరుగైన చికిత్స లభిస్తుందని కామినేని వెల్లడించారు. వైద్య రంగం అభివృద్ధికి ముందుకు వచ్చిన నాట్కో యాజమాన్యానికి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సొంత భవనాలు లేని ఆరోగ్య ఉప కేంద్రాలను అంగన్‌వాడీ కేంద్రాలకు అనుసంథానం చేయాలని సిఎం సూచించినట్టు మంత్రి కామినేని తెలిపారు.