ఆంధ్రప్రదేశ్‌

వడ్డీతోసహా చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను ఈ-వేలం ద్వారా విక్రయించి ఆ సొమ్మును వినియోగదారులు, ఏజెంట్లకు వడ్డీతో సహా చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని అఖిల భారత అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కె రంగారెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపింది. శుక్రవారం నగరంలోని ఒక హోటల్‌లో అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రంగారెడ్డి మాట్లాడుతూ సంస్థ ఇచ్చిన చెక్కులు, రసీదులు ఉపయోగించి ప్లాట్లు కొనేందుకు అనుమతించాలని, ఇప్పటికే ప్లాట్లకు పూర్తి మొత్తం చెల్లించిన వారికి రిజిష్ట్రేషన్ చేయాలని, 20 ఏళ్లగా సంస్థను నమ్ముకుని ఉన్న ఏజెంట్లకు కమిషన్ ఇచ్చి ప్లాట్లు అమ్మడానికి అవకాశం కల్పించాలని కోరారు. వినియోగదారులకు హైకోర్టు నియమించిన కమిటీ ద్వారా గానీ, ప్రభుత్వం ద్వారా గానీ బకాయిలు ఎప్పుడు చెల్లించడం ప్రారంభిస్తారో తెలియజేయాలని కోరారు.