ఆంధ్రప్రదేశ్‌

నగదుకూ కృత్రిమ కొరత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 19: ఇంత కాలం నిత్యావసర వస్తువుల కొరత పేరుతో అక్రమాలకు వ్యాపారులు తెరలేపగా తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే అత్యధిక మంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా నగదుకు కూడా కృత్రిమ కొరత ఏర్పడిందని కొంత మంది బ్యాంకు సిబ్బంది వాపోతున్నారు. ప్రైవేటు రంగంలోని బ్యాంకులు తమ ఖాతాదారులకు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన సొమ్ము ఇచ్చి వారి మన్ననలు పొందగా ప్రభుత్వ రంగ బ్యాంకర్లు మాత్రం బ్యాంకుల నుంచి కదలకుండా ‘నో క్యాష్’ బోర్డులు ఏర్పాటు చేస్తూ ప్రజాగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజర్వ్ బ్యాంకు నుంచి జిల్లాలకు వచ్చిన నగదు యథావిధిగా ప్రజల చేతికి చేరి ఉంటే ఇంత కాలం నగదు సమస్య తలెత్తేదే కాదని బ్యాంకులో పనిచేసే అధికారి ఒకరు తెలిపారు. రిజర్వ్ బ్యాంకు నుంచి వచ్చిన నగదు ఆయా జిల్లా కేంద్రాలకు చేరిన తరువాత జిల్లాల్లోని అన్ని బ్యాంకులకు ఎంత నగదు వెళ్లాలో నిర్ణయిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇలా నిర్ణయించిన మొత్తం ఉన్నతాధికారులు ఆ బ్యాంకు (చెస్ట్ బ్యాంకు) ప్రధాన కార్యాలయానికి వెళ్లి భద్రత నడుమ తెచ్చుకుంటారన్నారు. అయితే చెస్ట్ బ్యాంకుకు వెళ్లకుండా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉన్నతాధికారులు ఫోన్ ద్వారా, దిగువ స్థాయి సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందికి పని పురమాయించి ఇళ్లు, బ్యాంకులకు పరిమితమయ్యారని ఆయన వాపోయారు. ఇక్కడే ప్రైవేటు రంగంలోని బ్యాంకు అధికారులు కాస్త చొరవ చూపి చెస్ట్ బ్యాంకుకు వచ్చిన నగదును దగ్గరుండి తీసుకుపోవడమే కాకుండా ఇతర బ్యాంకుల అధికారులు రాకపోతే వారి వాటా నుంచి కూడా కొంత మొత్తం తమ బ్యాంకుకు తరలించి ప్రజలకు అందించారని గుర్తు చేశారు. తమకు రావాల్సిన వాటా కన్నా ఎక్కువ తీసుకుపోవడం వల్ల ప్రైవేటు రంగ బ్యాంకర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా ప్రజావసరాలకు నగదును పంపిణీ చేశాయని ఆయన అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతి కొద్ది మంది బ్యాంకర్లు మాత్రమే చెస్ట్ బ్యాంకుకు చేరుకుని తమ శాఖకు కేటాయించిన నగదు తీసుకెళ్లి ప్రజలకు అందించారని అన్నారు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాతాదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందించలేకపోయారని అభిప్రాయపడ్డారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులకు చేరాల్సిన వాటాలో 20 శాతం కూడా చేరలేదని ఆయన అభిప్రాయపడ్డారు.