ఆంధ్రప్రదేశ్‌

వకుళామాత ఆలయం పునర్నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 20: కలియుక ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తల్లిగారైన వకుళామత ఆలయం పునర్నిర్మాణానికి టిటిడి బోర్డు అంగీకరించిందని టిటిడి పాలక మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. అనంతరం బోర్డు తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం చదలవాడ విలేఖరులకు వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి రూరల్ మండలం పేరూరు బండపై ఉన్న స్వామివారి తల్లి వకుళామాత ఆలయ పునరుద్ధరణ పనులను వెంటనే ప్రారంభించేందుకు అవసరమైన అంచనాలను తయారుచేయమని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించామన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణకు రూ.2.04 కోట్లు రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు వివరించారు.
సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో భక్తులు సమర్పించిన తలనీలాలను ఈ-వేలం ద్వారా రూ.14 కోట్ల 71 లక్ష 58 వేల రూపాయల ఆదాయం లభించిందన్నారు. బెంగళూరుకు చెందిన బాబు లోకనాథన్, జయశ్రీ బాబు, బెంగళూరులోని జెపి నగర్‌లోరూ.57.33 లక్షల విలువైన తమ స్వగృహాన్ని టిటిడికి విరాళంగా ఇచ్చారన్నారు. ఈ స్వగృహాన్ని స్వీకరించడానికి ఆమోదించామన్నారు. అంతేకాక శ్రీవారి ప్రసాదం తయారీకి అవసరమైన మేలురకం బియ్యం, జీడిపప్పు, ఇతర వస్తుసామగ్రి కొనుగోలుకు బోర్డు అనుమతించిందన్నారు. తిరుపతి సుందరీకరణ పనుల్లో భాగంగా టిటిడికి రేణిగుంట జంక్షన్ నుంచి కాలూరు క్రాస్‌వరకు ఉన్న రోడ్డు వెంబడి విద్యుదీకరణ సుందరీకరణ పనులకు రూ.10 కోట్లు తుడాకు నిధులు మంజూరుచేసినట్లు ఆయన తెలిపారు. కాగా శ్రీవారి ఆలయ పోటులో పనిచేస్తున్న 176మంది కార్మికుల సర్వీసు మరో ఏడాది పొడిగించింది. అలాగే టిటిడి కాంట్రాక్ట్ డ్రైవర్లకు వేతనాలు పెంచాలని బోర్డులో నిర్ణయించామన్నారు. టిటిడి ఉప ఆలయాల్లో 447 మంది అర్చకులు, పరిచారికల పోస్టులకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించామన్నారు. ఈ సమావేశంలో టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ, తిరుమల జె ఇ ఓ కె ఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి జె ఇ ఓ పోలాభాస్కర్, ధర్మకర్తల మండలి సభ్యులు రాఘవేంద్రరావు, భానుప్రకాష్‌రెడ్డి, సండ్రా వెంకటవీరయ్య, సుచిత్రా ఎల్లా, పి. అనంతలక్ష్మి, పుట్టా సుధాకర్‌యాదవ్, అరికేళ నరసారెడ్డి, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కృష్ణమూర్తి, డోలా బాలవీరాంజనేయ, చింతల రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.