రాష్ట్రీయం

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాసతీర్మానం ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీ వైకాపా నిర్ణయించింది. స్పీకర్ శాసనసభలో నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైకాపా శాసనసభాపక్ష సమావేశం తీర్మానించింది. మంగళవారం ఇక్కడ లోటస్‌పాండ్ కార్యాలయంలో వైకాపా శాసనసభాపక్ష సమావేశం జరిగింది.
అనంతరం వైకాపా శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ విలేఖర్ల సమావేశంలో పై నిర్ణయాలను ప్రకటించారు. ఈ నెల 23వ తేదీ బుధవారం స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తామన్నారు. శాసనసభాపతి తీరు విచారకరమన్నారు. ప్రతిపక్ష పార్టీని విశ్వాసంలోకి తీసుకోలేదన్నారు. కాల్‌మనీ రాకెట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యే రోజా మాట్లాడాల్సి ఉందన్నారు. రోజా ధారాళంగా మాట్లాడి అధికార పార్టీపైవిరుచుకు పడుతుందనే ఆందోళనతో ఆమెను నిబంధనలకు విరుద్ధంగా సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారన్నారు. తాము రోజాపై సస్పెన్షన్ వేటు వేసినందుకు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటిసు ఇవ్వడంలేనదన్నారు. సభలో వైకాపా సభ్యులు మాట్లాడినప్పుడు అధికార పార్టీ సభ్యులు ఆటంకపరుస్తున్నా, స్పీకర్ నిలువరించడంలేదన్నారు. ప్రతిపక్ష నేత జగన్ 40 నిమిషాల సేపు మాట్లాడితే 17 సార్లు అంతరాయం కలిగించారన్నారు. స్పీకర్ ప్రతిపక్ష పార్టీ నేత మాట్లాడుతున్నప్పుడు అధికార పార్టీ సభ్యులు ఆటంకం కలిగించకుండా చూడాలన్నారు.
ప్రజల పక్షాన నిలబడి వైకాపా పోరాడుతుందని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలువరించే సమయంలో అధికార పార్టీ సభ్యులు జగన్‌పై వ్యతిరేకంగా మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నారన్నారు.