ఆంధ్రప్రదేశ్‌

పంట పొలాల్లో రసాయనాల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్చూరు, డిసెంబర్ 27: ప్రకాశం జిల్లా పర్చూరు మండల పరిధిలోని ఉప్పుటూరు పొలాల్లో రసాయనాలు పడేశారన్న వార్త మంగళవారం కలకలం రేగింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రివేళల్లో ప్లాస్టిక్ డ్రమ్ముల్లో విషతుల్య రసాయన పదార్థాలు కాల్వ గట్లపై పడేస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. రెండు రోజుల నుంచి ఈ ప్రక్రియ జరుగుతోంది. ఘాటైన వాసనతో కూడిన రసాయనాలు తమ పంటల సమీపంలో పైరు మాడిపోతుందని వారు వాపోయారు. స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగన వ్యవసాయశాఖ అధికారులు పరిస్థితిని పరిశీలించారు. 250 లీటర్ల రసాయనాలు కల్గిన డ్రమ్ములు మొత్తం 40వేల లీటర్లు పారబోశారని గుర్తించారు. డ్రమ్ముపై ఉన్న ఫోన్ నెంబరు ద్వారా సంప్రదించగా అహ్మదాబాదులోని పరేటర్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చాయని, నాగార్జున పురుగుల మందు ఫ్యాక్టరీలకు తాము సదరు రసాయనాలు పంపుతామని ఎడిఎకి తెలిపారు. మిథైల్ మోనో క్లోరో ఎథిఫేట్ రసాయనం, డిబిసిటి ఎమల్షన్, హెచ్‌ఎం బిటి ఎమల్షన్, పి5 ఎమల్షన్ రసాయనాలున్నాయని ఎడిఎ తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎడిఎ తెలిపారు.