ఆంధ్రప్రదేశ్‌

ఉచిత ఆలయ దర్శనానికి ఆర్‌టిసి సర్వీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 29: దేవాదాయ, ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత ఆలయ దర్శనాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోందని రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. గురువారం వెలగపూడి సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇందుకోసం అద్దె ప్రాతిపదికన దేవాదాయశాఖకు బస్సులు కేటాయిస్తామన్నారు. ప్రతి బస్సులో సుశిక్షితులైన ఇద్దరు డ్రైవర్లతో పాటు ఒక అటెండర్‌ను నియమిస్తామని చెప్పారు. వచ్చేనెల రెండో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు యాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. వచ్చే ఏడాది అన్ని మండలాల నుంచి పదివేల మంది భక్తులను పుణ్యక్షేత్రాలకు తరలించేందుకు అవసరమైన బస్సులను అన్ని హంగులతో సిద్ధం చేశామని వివరించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి 2510 ప్రత్యేక బస్సులను ఆర్టీసి నడుపుతుందని తెలిపారు.