ఆంధ్రప్రదేశ్‌

టిడిపితో దోస్తీకి ఢోకా లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 4: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రజలందరికీ అందేలా ఇక తమ కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి కృషి చేయనున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపి డాక్టర్ కంభంపాటి హరిబాబు చెప్పారు. సోమవారం నాడిక్కడ పార్టీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర ముఖ్యుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా కంభంపాటి విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలోని అధికార పక్షం తెలుగుదేశం పార్టీతో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందుల్లేవని, తమ మిత్రత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తుందంటూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు ఇప్పుడే పొత్తుల విషయమై తామెవరం ఆలోచించడం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై గ్రామస్థాయి నుంచి విస్తృత ప్రచారం చేయాల్సిందిగా పార్టీ నాయకుల సమావేశంలో హరిబాబు పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పడిన పార్టీ జిల్లా కార్యవర్గాలు అత్యంత ఉత్సాహంతో పార్టీని ప్రజలకు చేరువచేసేలా కృషి చేయాలన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు ఏప్రిల్‌లో పార్టీ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 5న బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి కార్యక్రమాలు, 6న పార్టీ సంస్థాగత దినోత్సవం సందర్భంగా ఉదయం పార్టీ కార్యాలయాల్లో పార్టీ పతాకాలు ఎగురవేయాలన్నారు. సాయంత్రం పార్టీ కార్యకర్తలు 2 లేదా 3 కి.మీ.లు రూట్‌మార్చ్ నిర్వహించాలన్నారు. 11న జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమాలు, 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా సామాజిక సమరసత పేరుతో 3 రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. 14 నుంచి 24 వరకు గ్రామీణాభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి జరుగుతుందనే విషయంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిర్వహించాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు కిందిస్థాయిలో పూర్తిగా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. కేంద్ర పథకాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు రెండు ప్రాంతాల్లో రెండురోజులు వర్క్‌షాపులు నిర్వహిస్తామని కంభంపాటి వివరించారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు పి మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు కంతేటి సత్యనారాయణరాజు, సోము వీర్రాజు, మాజీ మంత్రి పురంధ్రీశ్వరి, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, పలువురు నాయకులు పాల్గొన్నారు.

చిత్రం విజయవాడలో జరిగిన బిజెపి నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి కంభంపాటి హరిబాబు