ఆంధ్రప్రదేశ్‌

మాజీ ఎంపి పద్మనాభం కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 1: రాజ్యసభ మాజీ సభ్యులు, కొల్లేరు సరస్సు పరిరక్షణ సమితి నాయకులు, రైతు కార్యాచరణ సమితి అధికార ప్రతినిధి, మెంటే పద్మనాభం (84) తీవ్ర అనారోగ్యంతో ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. మెంటే పద్మనాభం 1994లో టిడిపి తరపున రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ హయాంలో గండిపేట మేధావిగా పేరొందిన ఆయన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా కూడా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని టెక్స్‌టైల్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా, రాజ్యసభలో టిడిపి పక్ష నేతగా, అప్పటి నేషనల్ ఫ్రంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా వ్యవహరించారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీ తరపున పాలకొల్లు అసెంబ్లీ స్థానం నుండి పోటీచేశారు. భీమవరం మున్సిపల్ కౌన్సిలర్ స్థాయి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. భీమవరం ఎడ్యుకేషనల్ సోసైటీ వ్యవస్థాపక సెక్రటరీ అండ్ కరస్పాండెంట్‌గా చాలాకాలం వ్యవహరించారు.

మెంటే పద్మనాభం (ఫైల్‌ఫొటో)