ఆంధ్రప్రదేశ్‌

ఎల్‌ఐసి మైక్రో ఇన్స్యూరెన్స్ మెగా మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 3: ఇటీవల కాలంలో అగ్రిగోల్డ్, అభయగోల్డ్, అక్షయ గోల్డ్ వంటి ప్రైవేట్ కంపెనీలు అమాయక ప్రజలను ఎలా బురిడీ కొట్టించారో ప్రతి ఒక్కరికీ కళ్లకు కట్టినట్లు కన్పిస్తోంది. అయితే ఈ ప్రైవేట్ కంపెనీలన్నీ ప్రజలకు ఎగవేసింది మొత్తంపై రూ. 10వేల కోట్లు లోపు. అయితే 65 65 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కల్గిన భారతీయ జీవన బీమా సంస్థ 2006 సెప్టెంబర్ 28 తేదీ నాటి రాష్టప్రతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాంచే ప్రారంభింప చేసిన మొట్టమొదటి మైక్రో ఇన్స్యూరెన్స్ పాలసీ జీవన్ మధుర్ వల్ల దేశ వ్యాప్తంగా లక్షలాది మంది గ్రామీణ నిరుపేదలు కొన్ని లక్షల కోట్లలోనే మోసపోయిన వైనం ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఇప్పటి వరకు ఒంగోలు, కరీంనగర్, వరంగల్, కడప ప్రాంతాల్లో దాదాపు రూ. 30 కోట్లుపైగా మోసపోయినట్లు బాధితులు ఆయా ప్రాంతాల్లో కేసులు దాఖలు చేస్తే తాజాగా విజయవాడ, గుంటూరు, రేపల్లి, చిలకలూరిపేట, తెనాలి, రాజమండ్రి, విశాఖ నగరాల్లో వేలాది మంది బాధితులు లబోదిబోమంటూ ఇపుడిప్పుడే రోడ్డెక్కుతున్నారు. కొద్ది రోజుల క్రితమే విజయవాడలోని ఎల్‌ఐసి డివిజన్ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేశారు. అగ్రిగోల్డ్ బాధితులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రభుత్వంపై పోరాటానికి నాయకత్వం వహిస్తున్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రస్తుతం బాధితుల వివరాలను సేకరించే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. పొదుపు పేరిట ప్రైవేట్ కంపెనీలు అమాయక గ్రామీణ ప్రజలను మోసగిస్తున్న నేపథ్యంలో ఎల్‌ఐసి అతి తక్కువ ప్రీమియంతో తగు బీమా రక్షణ సౌకర్యం కల్పించే లక్ష్యంలో మైక్రో ఇన్స్యూరెన్స్ విభాగం ఏర్పాటైంది. తొలి జీవన మధుర్ పాలసీ కింద వారం, పక్షం, నెల మూడు నెలలు లేదా ఆరు నెలలకోసారి ప్రీమియం చెల్లించవచ్చు ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సులో 15 సంవత్సరాల కాల పరిమితితో నెలకు రూ. 100లు ప్రీమియంతో ఈ పాలసీ తీసుకుంటే బీమా రక్షణ రూ. 18వేలు మరియు బోనస్ లభిస్తుంది లేదా పాలసీ పరిపక్వం అయినప్పుడు రూ.18,396 బోనస్ లభిస్తుంది. ఇక పథకం కింద తొలుత ప్రకాశం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కాస్తంత పలుకుబడి కల్గిన వారు డిస్టిబ్యూటర్‌లుగా చేరి తమకింద కమిషన్ పేరిట వందల సంఖ్యలో ఏజెంట్లను నియమించుకున్నారు. వీళ్లకి ఎల్‌ఐసి మైక్రో ఏజెంట్లంటూ ముద్ర వేశారు. ఇక వీరంతా తమతమ గ్రామాల్లో తమకున్న పలుకుబడి ముఖ్యంగా నమ్మకంతో లక్షల మంది ప్రజలను పాలసీదారులుగా చేర్పించారు. తొలిరోజే ఎల్‌ఐసి నుంచి పాలసీదారుల పేర్లతో పట్టాలు రావటంతో వారిలో ఆ ఏజెంట్లపై విశ్వాసం కుదిరింది. ఇక అక్కడ నుంచే మోసాలు అక్రమాలు ప్రారంభమయ్యాయి. రశీదుల స్థానంలో గట్టిగా అడిగిన వారికి పుస్తకాల్లో రబ్బరు స్టాంప్ వేసి పంపుతుంటే ఇక ఏజెంట్లు పాలసీదారులకు నోట్ పుస్తకాలు ఇచ్చి అందులో జమ వేయటం ప్రారంభించారు. ప్రారంభ ఐదేళ్ల కాల పరిమితితో 2008లో ప్రారంభమైన పాలసీలు 2013లో మెచ్యురిటీ అయినప్పుడు కాని అసలు భాగోతం బయటపడలేదు. ఏజెంట్లు తప్పించుకుంటునే కొందరు అడ్రస్ లేకుండా పరారయ్యారు. దీనిపై వారు ఎల్‌ఐసి కార్యాలయాల్లో విచారిస్తే పాలసీదారుల ప్రీమియం అరకొరగానే జమ అయినట్లు తెల్సి నిర్ఘాంతపోయారు. తొలుత ఒంగోలులో 2014 జూలై 2న ఏజెంట్లు అందరు కలిసి కె పాండు రంగారావు నాయకత్వంలో ఒక డిస్ట్రిబ్యూటర్‌పై కేసు నమోదు చేయగా అరెస్ట్ చేయటం కొద్ది రోజులు జైల్‌లో ఉండటం జరిగిపోయింది. ఇదే సమయంలోనే జీవన మంగళ్ అనే కొత్తపాలసీతో సరికొత్త ఏజెంట్లను నియమించుకుని మళ్లీ మోసగించడం ప్రారంభించారంటూ బాధిత ఏజెంటు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో తమ సమీప బంధువుల పేర్లతో డిస్ట్రిబ్యూటర్లగా నియమించి ఇతర ప్రాంతాల్లో జీవన మధుర్, జీవన మంగళ్ పాలసీలతో 2014లో కొత్త ఏజెంట్ల సహాయంతో మరికొన్ని లక్షల మందిచే పాలసీలు ప్రారంభించి మళ్లీ మోసగించడం ప్రారంభించారు. అయితే విజయవాడ, రేపల్లి, గుంటూరు ప్రాంతాల్లో ఐదేళ్ల వరకు ఆగకుండా రెండున్నర ఏళ్లలోనే మోసాలు గుర్తించి ఎల్‌ఐసి రశీదుల కోసం వెంటాడుతుంటే డిస్ట్రిబ్యూటర్లు పత్తాలేకుండా పారిపోవటంతో పాలసీదారులు లబోదిబోమంటున్నారు. ఆశ్చర్యకరం ఏమిటంటే మైక్రో ఇన్స్యూరెన్స్ విభాగంలో కొందరు డిస్ట్రిబ్యూటర్‌లతో కుమ్మక్కైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులోనే వెల్లడైంది. ఏజెంట్లలో అత్యధిక మంది గ్రామాల్లో చిన్నా చితక వ్యాపారాలు చేసుకునే పదో తరగతి చదివిన వారే కావటం వల్ల కూడా ఈ మోసాలకు అంతం లేకుండా పోతున్నది. ఒంగోలు బాధితుల ఏజెంటు గత రెండేళ్ల నుంచి ఇన్స్యూరెన్స్ అంబుడ్స్ మెన్స్, విజిలెన్స్, లోక్‌అదాలత్, సిబిసిఇడి, ఎల్‌ఐసి యాజమాన్యం చుట్టూ తమ వద్దనున్న ఆధారాలతో ప్రదక్షణలు చేస్తున్నప్పటికీ ఎలాంటి చలనం కన్పించడం లేదు. అసలు ఇంతకాలంలో ఎల్‌ఐసి ఈ వ్యవహారంను ఏ మాత్రం పట్టించుకోకపోవటం దారుణం.