ఆంధ్రప్రదేశ్‌

నోట్ల రద్దుపై కేంద్రాన్ని నిలదీస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 5: పెద్ద నోట్ల రద్దు, ప్రజలు నోట్లపాట్లతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నీటి ప్రాజెక్టులపై చంద్రబాబు చేస్తున్న అబద్దపు ప్రచారంతోపాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పాల్గొనున్న విషయాలపై ఎపిసిసి కార్యవర్గం కీలక నిర్ణయాలు తీసుకొంది. నోట్లరద్దు వెనుక దాగిన అవినీతి, రద్దు ప్రకటనకు ముందు కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కల్పించిన కేంద్ర పాలకుల లీకుల తీరు, నోట్లరద్దుతో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలలో మోదీ, బాబులు సమాన బాధ్యులేనన్న విషయాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించిన ఎపిసిసి నాయకత్వం కార్యవర్గానికి దిశ నిర్ధేశం చేసింది. ఈ సందర్భంగా గురువారం నగరంలోని ఎపిసిసి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దక్షిణ భారత కో అర్డినేటర్ డికె శివకుమార్ ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలు, చర్చించిన అంశాలపై మాట్లాడుతూ నోట్లపాట్ల బాధితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిన జాతీయ స్థాయి ఉద్యమంలో భాగంగా ఈనెల 6లేదా7 వ తేదీలలో 13 జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి, 9న ఖాళీ ప్లేట్లతో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు తెలుపుతూ ప్రకటించిన కార్యాచరణ ప్రకారం రాష్ట్ర వ్యాప్త మహోద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. రద్దు విషయాన్ని సిఎం చంద్రబాబు, జగన్ లతోపాటు తమకు కావాల్సిన కార్పొరేట్ వ్యక్తులు, సంస్థలకు ముందుగానే లీకులిచ్చి నల్లధన కుబేరులను ఆదుకొన్న పాలకులు సామాన్యుల జీవితాలను మాత్రం వీధులపాల్జేసిన అప్రజాస్వామ్య విధానాలే కాంగ్రెస్ పార్టీ ప్రచార ఆయుధాలన్నారు. నోట్లరద్దు వెనుక దాగిన కుట్ర, అవినీతి కుంభకోణాలన్నీ బహిర్గతం చేసి దోషులకు శిక్షపడే వరకూ కాంగ్రెస్ ఉద్యమం కొనసాగుతుందన్నారు. నోటుకోసం ఎటిఎం, బ్యాంకుల వద్ద క్యూలైన్లలో మృతి చెందిన వారందరికీ 25లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. అలాగే రాబోయే శాసన మండలి, కార్పొరేషన్ ఎన్నికలపై ఎపిసిసి చేపట్టాల్సిన కార్యాచరణ, అభ్యర్థుల ఎంపిక పై నియమావళిని ప్రకటించిన రఘువీరారెడ్డి 13 జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గల సమీక్షపై కార్యవర్గంలో విస్తృతంగా చర్చించిన అనంతరం కమిటీలను ప్రకటించారని తెలిపారు. పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులపై జరుగుతున్న అవినీతి, చంద్రబాబు చేస్తున్న అబద్ధాల ప్రచారాలను తిప్పికొట్టి నిజా నిజాలను ప్రజలకు తెలియపర్చి పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కెవిపి రామచంద్రరావు, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో మాట్లాడుతున్న రఘువీరారెడ్డి