ఆంధ్రప్రదేశ్‌

కదన రంగంలోకి దూకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 5: కాపులను బిసిలుగా గుర్తించాలనే ఉద్యమంలో తాను చేస్తున్న పోరాటంలో కాపు మహిళలు కూడా కీలకపాత్ర పోషించాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. కాపు మహిళలంతా రోడ్డు మీదకు వస్తేనే ఈ ఉద్యమం తీవ్రతరమై భావితరాల భవిష్యత్తు బాగుపడుతుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో రిజర్వేషన్ల ఉద్యమంలో మహిళల భూమికపై గురువారం నిర్వహించిన రాష్ట్ర స్ధాయి మహిళా సదస్సులో ముద్రగడ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సదస్సులో 13 జిల్లాల కాపు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ కాపులను బిసిల్లో చేర్చుతానని నాటి పాదయాత్రలో సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆ హామీనే అమలుచేయాలని కోరుతున్నామన్నారు. బిసి కులాలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా తాము ప్రత్యేక రిజర్వేషన్లను మాత్రమే డిమాండ్ చేస్తున్నామన్నారు. తాను చేస్తున్న ఉద్యమంలో భాగస్వాములు కావాలని ముద్రగడ మహిళలను కోరారు. కాపు ఉద్యమ నేత నల్లా విష్ణుమూర్తి మాట్లాడుతూ కాపులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. చంద్రబాబు ఇచ్చిన మూడు హామీలను అమలు చేయాలన్నారు. రాష్ట్ర మహిళా నేత ఆకుల భాగ్య శ్రీసూర్యలక్ష్మి మాట్లాడుతూ ముద్రగడ ఉద్యమంలో మహిళలు అధికంగా పాల్గొంటే ఉద్యమం మరింత జోరందుకునేదన్నారు. ఇప్పటికైనా మహిళలంతా శక్తి మేరకు ఉద్యమాల్లో కలిసిరావాలని కోరారు. సినీ నటి హేమ మాట్లాడుతూ తాను సినీరంగంలో ఉన్నా కాపు ఉద్యమం గురించే తెలుసుకుంటున్నారన్నారు. అవకాశాలు రాకున్నా తాను కాపు ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారు. అంతకు ముందు సినిమారోడ్డులో ఖాళీ కంచాలపై గరిటెలతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన మహిళలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాపు మహిళలు వెంట్రప్రగడ ఉమామహేశ్వరి, డాక్టర్ పోలిశెట్టి సునీత, పంతం ఇందిర, జానపాముల లక్ష్మి, పెద్దిరెడ్డి రామలక్ష్మి, మంచెం ఛాయాదేవి, అడ్డాల శ్రీలక్ష్మి, జెఎసి నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, జానపాముల నాగబాబు, మలకల చంటిబాబు, సంగిశెట్టి అశోక్, తుమ్మలపల్లి రామకృష్ణ, పేపకాయల రామకృష్ణ, కల్వకొలను తాతాజీ, జి స్వామి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ముద్రగడతో కలిసి కంచాలపై గరిటెలతో కొట్టి నిరసన వ్యక్తం చేస్తున్న కాపు మహిళలు