ఆంధ్రప్రదేశ్‌

వచ్చే బడ్జెట్‌లో యువతకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 9: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. యువజన, క్రీడా విధానాలను కలుపుతూ యువతను బలోపేతం చేసేందుకు వీలుగా బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉంటాయని తెలిపారు. ఈ ఏడాది కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టామని, నిపుణుల, ప్రజల అభిప్రాయాలను కూడా సేకరిస్తామని తెలిపారు. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ప్రీ-బడ్జెట్‌పై చర్చలో భాగంగా రైతులు, ఆర్థిక రంగానికి సంబంధించి ప్రొఫెసర్లతో వెలగపూడి సచివాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ 2017-18 సంవత్సరానికి ప్రజలు, నిపుణుల అభిప్రాయాలను తీసుకుని బడ్జెట్ రూపకల్పన చేస్తున్నామన్నారు. ఎన్జీవోలు, సామాజిక సంస్థలతో కూడా చర్చించనున్నట్లు తెలిపారు. పరిశ్రమలు, పర్యాటక రంగ అభివృద్ధికి కూడా బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించనున్నామన్నారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పన సమయంలో పన్నులకు సంబంధించి అంశాలు ఉండటంతో నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటారని, ఆ విధానాన్ని రాష్ట్రంలోనూ అమలుచేయాలని నిర్ణయించామన్నారు. వర్షాధారిత, వర్షాభావ పరిస్థితులపై సూచనలు వచ్చాయన్నారు. యువత సాధికారత కోసం బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించనున్నట్లు తెలిపారు. వేరుశనగ పంటను కొన్ని ప్రాంతాల్లో కాపాడలేకపోయామన్నారు. పట్టిసీమ, పురుషోత్తమపురం ద్వారా మరిన్ని ఎకరాలకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పారిశ్రామిక రంగంలో ఎంఎస్‌ఎంఇ యూనిట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వీటి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కేం ద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఈ యూనిట్లు మూసేస్తే ఉపాధి అవకాశాలు ప్రభావితం అవుతాయన్నారు. యువతకు స్వయం ఉపాధికి సంబంధించి చైనా నమూనా అమలును పరిశీలిస్తున్నామన్నారు. పారిశ్రామిక రంగానికి సంబంధించి వౌలిక వసతుల కల్పన, సేవా రంగం, పర్యాటకం, ఐటి రంగానికి కూడా తగిన ప్రాధాన్యత కల్పించనునున్నట్లు వెల్లడించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించనున్నామని, దీనివల్ల ఉపాధితో పాటు ఆదాయం లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలపై సేవా రుసుములకు సంబంధించి త్వరలో ఒక నిర్ణయాన్ని ఆర్‌బిఐ ప్రకటించనుందని తెలిపారు.

చిత్రం..విలేఖర్లతో మాట్లాడుతున్న మంత్రి యనమల