ఆంధ్రప్రదేశ్‌

మద్దతు ధర చెల్లించి కందులు కొనండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 17: రాష్ట్రంలో కంది రైతులను ఆదుకోవాలని, మద్దతు ధర చెల్లించి కందులు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. దావోస్ నుంచి మంగళవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కందులను కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. కొన్న కందులను మిల్లింగ్ చేసి సబ్సిడీ ధరకు తెల్లకార్డుదారులకు పంపిణీ చేయాలన్నారు. విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలను కూడా పరిశీలించాలన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు నాసిరకం సరుకులు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుడ్లు, ఇతర సరుకులు నాణ్యమైనవి సరఫరా చేసేలా మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వుండాలని, తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. ప్రకాశం జిల్లాలో మూత్రపిండాల వ్యాధులు, విజయనగరం జిల్లాలో లెప్రసీ వ్యాధి ప్రబలడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
వైద్య ఆరోగ్యశాఖ తక్షణమే స్పందిం చి ఆయా ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని, వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కల్పించాలని ఆదేశించారు. డయాలసిస్ సదుపాయం అందరికీ అందుబాటులో వుండేలా చూడాలన్నారు. ప్రకాశం జిల్లాలో నీటి నమూనాలను సేకరించి పరిశోధనకు పంపాలని ఆదేశించారు. ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంలో పింఛన్లకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొత్త పింఛన్ల మంజూరుకు బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, పౌరసరఫరాలశాఖ, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్లు రాజశేఖర్, రామాంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.