ఆంధ్రప్రదేశ్‌

చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ పవన్‌కల్యాణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: తెలుగు రాష్ట్రాల్లో చేనేత కుటుంబాల జీవన పరిస్థితులు మెరుగుపడటానికి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నేత కార్మికుల కష్టాలను విని చలించి పోయారు. తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్యవేదిక, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం సభ్యుల బృందం హైదరాబాద్‌లోని జనసేన పరిపాలనా కార్యాలయంలో పవన్‌కల్యాణ్‌ను కలుసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంభవిస్తున్న నేత కార్మికుల ఆకలి చావులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గత రెండున్నరేళ్లలో ఒక్క తెలంగాణలోనే 45 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారు వివరించారు. నేత పని గిట్టుబాటు కాక మరే ఇతర పని చేతకాక చేనేత కార్మికులు తనువు చాలిస్తున్నారని , వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని అన్నారు. వచ్చే నెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న చేనేత సత్యాగ్రహం, పద్మశాలి గర్జన కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా పవన్‌కళ్యాణ్‌ను వారు కోరారు. అందుకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు.
నేత కార్మికుల కష్టాలను సావధానంగా విన్న పవన్ కల్యాణ్ నేత కళ మన జాతి సంపద అని ఉద్వేగంగా అన్నారు. దానిని పరిరక్షించుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. నేత సంఘాల నాయకుల అభ్యర్థనపై చేనేతకు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా స్వచ్ఛందంగా ఉంటానని ప్రకటించారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి తన శక్తి మేర కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అఖిల భారత హాండ్లూమ్ బోర్డు సభ్యుడు కెఎఎన్ మూర్తి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ నేత సంఘాల నాయకులు, తెలంగాణ చేనేత అఖిల పక్ష ఐక్య వేదిక కన్వీనర్ కూరపాటి రమేష్ నాయకత్వంలో తెలంగాణ నేత సంఘాల నాయకులు పవన్‌కల్యాణ్‌ను కలిసిన వారిలో ఉన్నారు.