ఆంధ్రప్రదేశ్‌

రోడ్‌పై కుప్పలుగా ఎటిఎం కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 20: నెల్లూరు శివారులో మైపాడు రోడ్డులో ఒక ప్రైవేటు కార్పొరేట్ బ్యాంకుకు చెందిన ఎటిఎం కార్డులు గుట్టలుగుట్టలుగా పడి ఉండడం కలకలం రేపింది. నెల్లూరు - మైపాడు రహదారిలో మూడో మైలు రాయి వద్ద ఐసిఐసిఐ బ్యాంకుకు చెందిన భారీ సంఖ్యలో రూపే కార్డుల గుట్టను శుక్రవారం సాయంత్రం స్థానికులు గమనించారు. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో జనం గుమికూడారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కూడా అక్కడకు చేరుకున్నారు. ఈలోగా అత్యుత్సాహంతో కొన్ని చానళ్లలో చెల్లుబాటులో ఉన్న బ్యాంకు ఎటిఎం కార్డులు చెత్తబుట్టలో దర్శనం ఇచ్చాయని ప్రసారం చేయడంతో నిజంగా కలకలం రేగింది. ఈలోగా మరికొంతమంది మీడియా ప్రతినిధులు లోతుగా అధ్యయనం చేయడం కోసం సంబంధిత అధికారులను సంప్రదించగా ఐసిఐసి బ్యాంకులో కార్డుల విభాగం ఇన్‌చార్జి జి శ్రీనివాస్ ద్వారా సమాచారం సేకరించారు. ఆయనిచ్చిన సమాచారం మేరకు ఆ కార్డులు చెల్లుబాటులో లేవని, ఇదివరలో పెన్షనర్లకు పంపిణీ చేసేందుకు మణిపాల్ సొల్యూషన్ అనే సంస్థకు ఇచ్చామని, తరువాత వారు ఆ కార్డులను పంపిణీ బాధ్యతను స్వయం సహాయక బృందాలకు ఇచ్చారన్నారు. ఆ కార్డుల మీద బిజినెస్ కార్పస్ ఫండ్ అని రాయబడి ఉందన్నారు. సదరు కార్డులు 2013 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉండేవని, తదుపరి కాలపరిమితి ముగిసిందన్నారు. ఆ కార్డులు 2012-13కు సంబంధించినవని తెలిపారు. 2014 సంవత్సరం నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోస్టల్ ద్వారా పింఛన్లు పంపిణీ చేయడంతో కార్డులు నిరుపయోగంగా మారాయన్నారు. దీంతో వాటి కాలపరిమితి కూడా ముగిసిందన్నారు. కాలం తీరిన కార్డులను స్వయం సహాయక సంఘాలు గంపగుత్తగా ఊరికి దూరంగా పడవేసి ఉండొచ్చని ఆయన చెప్పారు. ఎటిఎం కార్డులు గుట్టలుగా పడి ఉండడంతో సహజంగా కలకలం రేగిందని శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. ఈ కార్డులు దేనికీ పనికిరావని, ఎటిఎం మిషన్‌లో పెట్టినా బ్లాక్ అయిపోతుందని ఆయన తెలిపారు. దీంతో ఒక్కసారిగా రేగిన కలకలం చల్లారింది.

చిత్రం..మైపాడు రోడ్డులో వంతెన కింద గుట్టలు గుట్టలుగా పడి ఉన్న ఎటిఎం కార్డులు