రాష్ట్రీయం

ప్రత్యేక హోదా సాధనలో రాజీపడ్డారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: జల్లికట్టు క్రీడను కాపాడుకునేందుకు తమిళ యువత సాగించిన పోరాటం నిరుపమానమని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ కొనియాడారు. తమ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకునేందుకు మతాలు, పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా తమిళులు ప్రదర్శించిన సాహసాన్ని ఆయన అభినందించారు. లక్షలాది మంది తమిళ ప్రజలు మెరీనా బీచ్‌లో గుమికూడి ఎంతో సంయమనంతో తమ డిమాండ్ సాధనకు అంకితమయ్యారని, ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రదర్శన జరగడాన్ని ఆయన స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా రాకపోవడానికి రాజకీయ నాయకుల వ్యాపార లావాదేవీలు, వారి స్వార్ధ ప్రయోజనాలే కారణమని, అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని సామాన్య ప్రజలు నిరంతరం పరితపిస్తున్నారని పవన్ ట్వీట్ చేశారు.