ఆంధ్రప్రదేశ్‌

మాతృభాషను నిర్లక్ష్యం చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం, జనవరి 21: ప్రపంచ చిత్రపటంలో రాజాం ఖ్యాతిని విద్యార్థులు ఇనుమడింప చేయాలని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు హితవు పలికారు. శనివారం జిఎంఆర్‌ఐటి ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మన చరిత్ర, మన విద్య, మన పరంపర మనకు మనమే విశే్లషించుకోవాలన్నారు.
సంవత్సరానికి 365 రోజులు అనే అంశాన్ని వెయ్యేళ్ల కిందటే భాస్కరాచార్యులు గణించారని, అలాగే ఆర్యభట్ట, పాణిని వంటి వారు ఆనాడే శాస్త్ర విజ్ఞాన అద్భుతాలు ఆవిష్కరించారన్నారు. తెలుగు మీడియంలో చదివితే కొంపమునుగుతుందనే భావన పోవాలని, మాతృభాషను, మాతృభూమిని, తల్లిని నిర్లక్ష్యం చేయరాదన్నారు. 12వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే చదివిన వారు ఉన్నత సోపానాలు అలంకరించారని, ముఖ్యంగా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకుంటే ఆంగ్లమైనా, తెలుగైనా ఒక్కటేనన్నారు. మెకాలే విద్యా విధానంలో ఏం చదువుతున్నామో తెలియని పరిస్థితి ఏర్పడిందని, తుప్పుబట్టిన విధానాలను విడనాడాలన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కొన్ని అంతరాలను తగ్గించుకొని సరికొత్త ప్రయోగాలకు తెరతీయాలన్నారు. ముంబయి ఐఐటి విద్యార్థులు ప్రథమ, తమిళనాడు ఇంజనీరింగ్ విద్యార్థులు సత్యభామ అనే శాటిలైట్‌ను సొంత పరిజ్ఞానంతో ఆవిష్కరించారని, ఆ రెండు రాష్ట్రాలకు తాను గవర్నర్‌గా ఉండడం ఎంతో సంతోషమైందన్నారు.ఆరోగ్యం, సంపదతో పాటు సంస్కృతి సంపద, శీలసంపద వంటివి కూడా అభివృద్ధి చేసుకోవాలని కపిలుడు సాంఖ్యం, కరాదులు వైశిష్టం, పతంజలి వియోగశాస్త్రం వంటి అంశాలు ప్రాతిపదికగా ప్రస్తుత ప్రధాన మంత్రి నిజాయితీతో కూడిన పరిపాలన చేపట్టారన్నారు. అబ్దుల్ కలాం, మోదీ, సర్ సివి రామన్ వంటి వారు ఎటువంటి అండదండలు లేకుండానే ఉన్నత పదవులు సాధించారన్నారు.
విద్య, ఉపాధి రెండు కళ్లుగా విద్యార్థులు భావించాలన్నారు. అనంతరం జిఎం ఆర్‌ఐటి సమావేశ మందిరంలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను తిలకించి మొక్కలు నాటారు. అంతకుముందు గవర్నర్‌కు పోలీసులు గౌరవవందనం చేసి స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి, కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, ఆర్‌డిఒ రెడ్డి గున్నయ్య, తహశీల్దార్ వై.శ్రీనివాసరావు, సిఇఒ రఘునాథన్, మీనా రఘునాథన్, వైస్‌చైర్మన్ నాగేశ్వరరావు, జిఎంఆర్ సోదరులు పెదబాబు, చినబాబు, డాక్టర్ రాజేంద్ర, పి.అన్నంనాయుడు పాల్గొన్నారు.

విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగర్‌రావు