ఆంధ్రప్రదేశ్‌

చిత్తూరు కోర్టుకు పేలుళ్ల ఉగ్రవాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జనవరి 27: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు కోర్డులో బాంబు పేలుడు కేసులో ఐదుగురు ఉగ్రవాదులను శుక్రవారం సాయంత్రం భారీ బందోబస్తు మధ్య పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. వీరికి వచ్చే నెల 10వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ నాల్గవ అదనపు జడ్జి భరద్వాజ్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలాఉన్నాయి. గతఏడాది ఏప్రిల్ నెలలో చిత్తూరు జిల్లా కోర్డు ఆవరణలో బాంబు పేలుడు ఘటన చోటు చేసుకొంది. ఈసంఘటనలో న్యాయవాది గుమస్తా బాలాజీ నాయుడు కు తీవ్రంగా గాయపడగా, పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. అప్పట్లో ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కేసు నయోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసు విషయంగా పలు కోణాల్లో చిత్తూరు పోలీసులు దర్యాప్తు చేపట్టినా కొల్కి తీసుకు రాలేక పోయారు. ఇంతలోనే ఇదే తరహాలో దేశంలో కేరళా, మదురై, తమిళనాడు, మైసూరు, తదితర ప్రాంతాల్లో బాంబు పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనలో ఉగ్రవాదులు ప్రమేయం ఉందన్న కోణంలో ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. దీంతో ఆ సంస్థ హైదారాబాద్ లో కొందరిని అదుపులోకి తీసుకొని విచారించింది. దీంతో ఈ బాంబు పేలుడు కేసుల్లో నిందితులైన మధురైకి చెందిన అబ్బాస్, దావుద్ సులేమాన్ ,ఖరమ్ రాజ్, మహ్మద్ అయ్యూబ్, చెన్నైకి చెందిన సంసుద్దీన్‌ల ప్రమేయం ఉందని భావించి వీరిని గత ఏడాది నంవంబర్‌లో ఎన్‌ఐఏ సంస్థ అధికారులు మధురైలో అరెస్టుచేసి రిమాండ్ నిమిత్తం బెంగళూరు జైలుకు తరలించారు. పిటి వారెంట్‌తో బందో బస్తు మధ్య ప్రత్యేక వాహనంలో చిత్తూరు కోర్టులో హాజరు పరిచారు. దీంతో జడ్జి వీరికి వచ్చే నెల పదో తేది వరకు రిమాండ్ విధించారు.