ఆంధ్రప్రదేశ్‌

చైనా ఎర్రచందనం స్మగ్లరు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 9: చైనా దేశానికి చెందిన ఎర్రచందనం స్మగ్లరు లిన్ డాంగ్ ఫూ(42)ను చిత్తూరు టాస్క్ ఫోర్సు బలగాలు శుక్రవారం అరెస్టు చేశాయి. జిల్లా ఎస్పి శ్రీనివాస్ కథనం మేరకు ఇటీవల చిత్తూరు తాలుకా పోలీసు స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా చిత్తూరు జిల్లా యల్లమందకు చెందిన ఎర్రచందనం అక్రమ రవాణాలో పైలెట్‌గా ఉన్న ప్రసాద్‌ను అరెస్టు చేశామన్నారు. అతను ఇచ్చిన సమాచారంతో చైనా దేశానికి చెందిన లిన్ డాంగ్ ఫూ బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి దాడులు నిర్వహించి శుక్రవారం బెంగళూరు సమీపంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. చైనాదేశం ఫుజియన్ స్టేట్‌కు చెందిన లిన్ డాంగ్ ఫూ గత కొంత కాలంగా ఢిల్లీని కేంద్రంగా చేసుకొని ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యక్రమాలను నిర్వహించే వాడని పేర్కొన్నారు. ఇతను ఇక్కడ ఎర్రచందనం దుంగలను పరిశీలించి వాటి వివరాలను ఫొటోలను చైనా దేశంలోని స్మగ్లర్లకు సమాచారం చేరవేయడం, అనంతరం వారితో వ్యాపార ఒప్పదం కుదుర్చుకొని చాకచక్యంగా ఎర్రచందనం దుంగలను చైనా ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ఇతని వ్యహారమని ఎస్‌పి తెలిపారు. 2013 నుంచి ఈ స్మగ్లింగ్ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించామని అన్నారు. ప్రధానంగా ఇతని గురువైన చైనాదేశానికి చెందిన చిన్ డాన్ ద్వారా స్మగ్లింగ్ కార్యక్రమాలను నిర్వహించే వాడని వివరించారు. ఇప్పటికే సుమారు వంద కోట్లకు చెందిన ఎర్రచందనం దుంగలను ఎగుమతి చేసినట్లు గుర్తించామని ఎస్పీ వివరించారు. ప్రస్తుతం అరెస్టు చేసిన చైనా దేశానికి చెందిన స్మగ్లరు లిన్ ఢాంగ్ ఫూ నుంచి ఇండియాకు చెందిన 22 వేల రూపాయలతో పాటు ఇతర దేశాలకు చెందిన 52 కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకొన్నట్లు చెప్పారు.