ఆంధ్రప్రదేశ్‌

మున్సిపాలిటీలను భయపెడుతున్న చెత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 9: రాష్ట్రంలోని పలు పురపాలక సంఘాలను చెత్త సమస్య తీవ్రంగా వేధిస్తోంది. డంపింగ్‌యార్డుల కొరత కారణంగా రోజురోజుకూ పట్టణాల్లో పెరిగిపోతున్న చెత్త పాలకవర్గాలకు, అధికార యంత్రాంగానికి తలపోటుగా పరిణమిస్తోంది. రాష్ట్రంలోని 110 పురపాలక సంఘాల్లో రోజూ 6,444 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఈ చెత్తను ట్రాలీలు, మినీ ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు డంప్ చేస్తున్నారు. మేజర్ డ్రైయిన్‌లు, కాలువ గట్లు, కొన్ని పురపాలక సంఘాల్లో మున్సిపల్ రిజర్వ్డు స్థలాల్లో డంప్‌చేస్తున్నారు. ఇప్పటికే చెత్త డంపుచేసే ప్రాంతాలన్నీ దుర్గంధభూయిష్టంగా మారుతున్నాయి. పెరిగిపోతున్న చెత్తను ఎప్పటికప్పుడు తగలబెట్టడం ద్వారా కొంతమేర సమస్యను తీర్చుకునే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ, దానివల్ల పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతీ పురపాలక సంఘానికి కంపోస్టుయార్డు తప్పనిసరి. రోజువారీ వచ్చే చెత్తను వివిధ రకాలుగా విడగొట్టి, రీసైక్లింగ్ చేయడం, కంపోస్టుగా మార్చడం వంటివి ఈ యార్డుల్లో చేస్తారు. కంపోస్టు యార్డు కాకున్నా కనీసం చెత్తను తీసుకెళ్లి ఒక చోట వేయడానికి డంపింగ్‌యార్డైనా ఉండాలి. కానీ రాష్ట్రంలోని 110 పురపాలక సంఘాల్లో 24 పురపాలక సంఘాలకు డంపింగ్‌యార్డుల్లేవు. వీటిలో కాకినాడ కార్పొరేషన్‌తో పాటు బాపట్ల, భీమవరం, మాచర్ల, మైదుకూరు, నరసాపురం, పెద్దాపురం, తాడేపల్లిగూడెం, తుని, వినుకొండ తదితర పురపాలక సంఘాలున్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం సెలక్షన్ గ్రేడ్, స్పెషల్ గ్రేడ్, ఫస్ట్‌గ్రేడ్ మున్సిపాల్టీగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేశ్వరం, కృష్ణాజిల్లాలోని నందిగామ, ప్రకాశం జిల్లాలోని అద్దంకి, కనిగిరి, చీమకుర్తి, నెల్లూరులోని ఆత్మకూరు, నాయుడుపేట, కర్నూల్ జిల్లాలోని ఆళ్ళగడ్డ, అనంతపూర్‌లోని మడకశిర, పమిడి, పుట్టపర్తి, కడప జిల్లాలోని ఎర్రగుంట్ల నగర పంచాయితీలుగా రూపాంతరం చెందాయి. వీటికి కూడా డంపింగ్‌యార్డుల అవసరం ఉంది. గ్రామాల నుండి నగర పంచాయితీలుగా రూపాంతరం చెందిన వీటిలో ఇప్పటికే చెత్తసమస్య తీవ్రమయ్యింది. రాష్ట్రంలోని దాదాపు 55 పురపాలక సంఘాల్లో ఒక్క డంపింగ్‌యార్డు మాత్రమే ఉంది. ఈ పురపాలక సంఘాల్లో ప్రతీరోజూ 15 నుండి 18 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తిఅవుతుంది. అయితే ఉన్న ఒక్క డంపింగ్‌యార్డు చెత్తతో నిండిపోవడంతో ఇక్కడి అధికారులకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఇక గుంటూరులో 6, నెల్లూరులో 5, విశాఖపట్టణంలో 4, చీరాలలో 3, ప్రొద్దుటూరులో 3, పులివెందుల 3, తాడిపర్తిలో 3 డంపింగ్‌యార్డులున్నాయి. మిగిలిన పురపాలక సంఘాలతో పోలిస్తే ఈ పురపాలక సంఘాల్లో చెత్త నిర్వహణ కాస్త మెరుగ్గా ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఇదిలా ఉండగా ఇప్పటికే పురపాలక సంఘాల్లో ప్రతీ నెల జరిగే కౌన్సిల్ సమావేశాల్లో చెత్త సమస్య ప్రధాన అజెండా మారుతోంది. చెత్త సమస్య ప్రస్తావన లేకుండా ఏ సమావేశం జరగడం లేదనడం అతిశయోక్తి కాదు.