ఆంధ్రప్రదేశ్‌

‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 29: కడప జిల్లాలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన దాడుల్లో 11 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ ఆదివారం వెల్లడించారు. అరెస్టయిన వారిలో ఒక పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు ఫారెస్టు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, నలుగురు ఫారెస్టు ప్రొటెక్షన్ వాచర్లు, ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఉన్నట్లు వివరించారు. అలాగే వారి నుంచి 1.3 టన్నుల బరువు కలిగిన 29 ఎర్రచందనం దుంగలు, 17 సెల్‌ఫోన్లు, ఒక టాటా 407 వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అరెస్టయిన వారిలో విఎన్ పల్లె స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ ఎద్దుల ఆల్‌ఫ్రెడ్, మద్దిమడుగు ఈస్ట్‌బీట్‌లో పని చేస్తున్న ఫారెస్టు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సొరకాయల వెంకటసుబ్బరాయుడు, అదే బేస్ క్యాంప్‌లో పనిచేస్తున్న ఫారెస్టు ప్రొటక్షన్ వాచర్ కొప్పు బాలగోపాల్, విఎన్ పల్లె మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన మద్దిమడుగు ఫారెస్టు ప్రొటక్షన్ వాచర్ చాకలి గంగా మహేష్, విఎన్‌పల్లె మండలం గోనుమాకులపల్లె గ్రామానికి చెందిన మద్దిమడుగు బేస్ క్యాంప్ ప్రొటక్షన్ వాచర్లు ముత్తుకూరి శివబ్రహ్మం, ముద్దనూరు మండలం వేల్పుచెర్ల గ్రామానికి చెందిన తెల్లెల గంగరాజు ఉన్నారని తెలిపారు. వీరితో పాటు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు అయిన వీరబల్లి మండలం పెద్దూరు గ్రామానికి చెందిన చమర్తి అమరేంద్రరాజు, సికె దినె్న మండలం బిడికి ప్రాంతానికి చెందిన మూడే మల్లికార్జుననాయక్ అలియాస్ చందు, ఒంటిమిట్ట మండలం బంగారుపల్లెకు చెందిన గుమ్మల్ల నిత్యపూజయ్య, కడప అంగడివీధికి చెందిన రెబ్బా సతీష్‌కుమార్, కడప భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన రాపూరి శివశంకర్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. దువ్వూరు మండలం టంగుటూరు మిట్ట వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా టాటా 407 వాహనంలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, వారిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.