ఆంధ్రప్రదేశ్‌

ఉత్కంఠగా పిడకల సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్పరి,ఏప్రిల్ 9: కర్నూలు జిల్లా ఆస్పరి మండల పరిధిలోని కైరుప్పుల గ్రామంలో శనివారం పిడకల సమరం అత్యంత ఉత్కంఠగా సాగింది. ఏటా సాంప్రదాయబద్ధంగా జరిగే ఈ పిడకల సమరంలో వీపులు కందిపోయి, తలలకు గాయాలైనా లెక్క చేయకుండా రాసులుగా పోసిన పిడకలన్నీ అయిపోయే వరకు కొట్టుకుంటూ గ్రామస్థులు ఆనందంతో మునిగితేలారు. కైరుప్పులలో వీరభద్రస్వామి కల్యాణోత్సవం సందర్భంగా నిర్వహించే పిడకల సమరానికి చారిత్రక నేపథ్యం ఉంది. వేట కోసం వచ్చిన వీరభద్రస్వామి కాళికాదేవిని చూసి ప్రేమలో పడతాడు. భద్రకాళికదేవితో ఏర్పడిన మనస్పర్థలతో వివాదం తలెత్తుతుంది. ఆ సందర్భంగా వారి వర్గీయుల మధ్య గొడవ జరిగి, అందుబాటులో ఉన్న పిడకలతో పరస్పరం కొట్టుగోగా, అదే సాంప్రదాయాన్ని నేటికీ ఉత్సవ రూపంలో ఆచరిస్తున్నట్టు దేవాలయ కార్యనిర్వాహణ అధికారి రాంప్రసాద్, గ్రామ పెద్దలు తెలిపారు.
ఆస్పరి మండల పరిధిలోని కారుమంచి గ్రామానికి చెందిన పెద్దరెడ్డి వంశస్థులు ఉత్సవం నిర్వహణలోప్రధాన పాత్ర పోషించారు. ఈ వంశస్థుల్లో ఒకరైన నరసింహారెడ్డి, రాజరికాన్ని గుర్తుతేచ్చేలా ప్రత్యేక వస్తధ్రారణతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో గుర్రంపై ఊరేగింపుగా కైరుప్పుల గ్రామం చేరుకున్నారు. అనంతరం వీరభద్రస్వామి, కాళీకాదేవిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ముఖాలకు స్వామి విబూధి రాసుకుని, తిరిగి వెళ్ళగానే పిడకల సమరం ప్రారంభానికి సూచికగా భక్తులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చటంతో ఒక్కసారిగా అరుపులు, కేకలు వెన్నంటాయి. పిడకల సమరంలో భాగంగా భక్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం భద్రకాళీదేవి తరపున, మరోక వర్గం వీరభద్రస్వామి తరపున సిద్ధమై ఆలయ ఆవరణలో రాసులుగా పోసిన పిడకలతో పరస్పరం కొట్టుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన పిడకల సమరం గంట పాటు సాగింది. పిడకల దెబ్బలకు కొందరికి తలకు గాయాలు కాగా, మరి కొందరికి శరీరాలు కందిపోయాయి. సుమారు 50 మందికి గాయాలైనట్టు అంచనా.
పిడకల మొక్కుబడి
మండల పరిధిలోని కైరుప్పులతోపాటు చెన్నంపల్లి, ఉప్పాలదొడ్డి, వెంగలాయదొడ్డి, కారుమంచి, ఆలారుదినె్న, యాటకల్లు, వలగొండ, డి.కోటకొండ, తదితర గ్రామాల భక్తులు స్వామివారికి మొక్కుబడుల కింద పిడకలను సమర్పించారు.